పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించగలిగింది. ఈ కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఆఫ్ రోడర్ గా బాగా ప్రసిద్ధి చెందింది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ యొక్క ఈ కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ విడుదలైనప్పనుంచి కూడా మంచి బుకింగ్స్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కంపెనీ, థార్ యొక్క బుకింగ్స్ లో ఒక కొత్త మైలురాయిని సాధించింది. దీనికి సంబంధించి కంపెనీ విడుదల చేసిన నివేదికల ప్రకారం థార్ బుకింగ్స్ ఇప్పుడు 55,000 దాటింది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ గత నెల ఏప్రిల్‌లో 50,000 బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది. రోజురోజుకి బుకింగ్స్ ఎక్కువవుతున్న కారణంగా దీని కోసం వినియోగదారులు నిరీక్షించవలసిన సమయం కూడా పెరుగుతోంది.

MOST READ:అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా థార్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని కంపెనీ తెలిపింది. కొత్త థార్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ బుకింగ్స్ 47 శాతం వరకు ఉంది. మహీంద్రా థార్ ప్రారంభించి 8 నెలలైంది, ఇంత తక్కువ కాలంలో ఎక్కువ బుకింగ్స్ అందుకున్న వాహనాల జాబితాలో మహీంద్రా థార్ కూడా చేరింది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త థార్ ఎస్‌యూవీ ధర రూ. 12.11 లక్షల నుంచి రూ. 14.16 లక్షల వరకు వుంది. ఈ కొత్త థార్ ఎస్‌యూవీ మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా, వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. కావున కొనుగోలుదారులు ఈ ఎస్‌యూవీని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

MOST READ:సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి కారణంగా మరియు ఎలక్ట్రానిక్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కొంత ఆలస్యమవుతోంది. ఈ కారణంగా మహీంద్రా థార్ బుక్ చేసుకున్న కస్టమర్లు దీనిని డెలివరీ చేసుకోవడానికి దాదాపు 10 నెలల కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు మాత్రమే కాదు దేశంలో ఉన్న ఆటో మొబైల్ సంస్థలు కూడా చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం మహీంద్రా థార్ ఎస్‌యూవీ బుక్ చేసుకున్న కస్టమర్లకు వీలైనంత త్వరగా థార్ ఎస్‌యూవీని అందించడానికి మరియు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి నాసిక్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.

MOST READ:టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా థార్ చాలా అద్భుతమైన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్.

ఇందులో ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగా, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో 4x4 ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా థార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది చాలా మంది డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త మహీంద్రా థార్ దాని మునుపటి మోడల్ కంటే శక్తివంతమైనది. కొత్త థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి మునుపటికంటే చాలా సేఫ్టీ రుజువు చేస్తుంది.

MOST READ:ఈ కారణంగానే అక్కడ లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా థార్ లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్‌తో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో టచ్‌స్క్రీన్ డిస్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ థార్ యొక్క 5-డోర్ల మోడల్‌ను త్వరలో ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. దీని కోసం వినియోగదారులు కూడా వేచి చూస్తున్నారు. ఈ 5-డోర్స్ థార్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రస్తుత థార్ మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra Thar Booking Crossed 55,000 Creates New Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X