మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

మారుతి సుజుకి బ్రాండ్ యొక్క మారుతి సుజుకి ఓమ్ని భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి. ఇది చాలా కాలం నుంచి వాడుకలో ఉంది. మారుతి సుజుకి యొక్క ఓమ్ని కారు బాలీవుడ్ సినిమాలలో కిడ్నాప్ కార్ లాగా ఉపయోగించిన సంఘటనలు చాలా చూసి ఉంటారు. కావున 90 లలోనే ఈ కారు బాగా ప్రజాదరణ పొందింది.

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

మారుతి సుజుకి తన ఓమ్ని వ్యాన్ భారత మార్కెట్లో సుమారు 35 సంవత్సరాలుగా విక్రయించబడింది. ఈ ఓమ్ని కారు ఎక్కువగా చిన్న వ్యాపారాలు మొదలైన వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. కావున ఈ కారు వాణిజ్యరంగంలో మంచి ఆదరణ పొందింది.

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

అయితే ఇటీవల కాలంలో మారుతి సుజుకి ఓమ్ని కారుని రోడ్లపై చూడటం చాలా అరుదు. కానీ అక్కడక్కడా ఇప్పుడు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఒక లంబోర్ఘిని స్టైల్ మాడిఫైడ్ ఓమ్ని కారు వెలుగులోకి వచ్చింది. ఈ మాడిఫైడ్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

ఈ మాడిఫైడ్ కారు సిజర్ డోర్స్, చంకీ బాడీ కిట్ మరియు డీప్ డిష్ గోల్డెన్ వీల్స్ తో పూర్తయింది. ఈ ప్రత్యేక మారుతి సుజుకి ఓమ్ని బ్లూ కలర్ బాడీ కలిగి ఉంటుంది. ఈ మాడిఫైడ్ మారుతి ఓమ్ని యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే ఇందులో లంబోర్ఘిని లాంటి డోర్స్ కలిగి ఉండటం.

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

ఇది మాత్రమే కాకుండా ఈ మాడిఫైడ్ కారులో బాడీ కిట్‌లో కొత్త పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, సైడ్ స్కర్ట్‌లతో కూడిన చంకీ ఫ్రంట్ బంపర్ మరియు వెనుక భాగంలో అప్‌డేట్ చేసిన బంపర్ ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల దీనికి హంకర్ డౌన్ లుక్ లభిస్తుంది. ఇదే సమయంలో ఈ ఓమ్నిలో బ్లాక్-అవుట్ రూఫ్ రాక్ ఉంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

ఇందులో ఇది మాత్రమే కాకుండా, విండ్‌షీల్డ్ హుడ్స్‌తో కూడిన ఎల్‌ఈడీ లైట్లు, లేటింటేడ్ గ్లాస్ అన్ని విండోలకు ఉపయోగించబడ్డాయి. ఈ మార్పులో, పెద్ద మరియు మందపాటి డీప్-డిష్ గోల్డెన్ రౌండ్ వీల్స్ వ్యవస్థాపించబడ్డాయి. ఈ మాడిఫికేషన్స్ వల్ల ఈ మారుతి సుజుకి ఓమ్ని మునుపటికంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

ఒకప్పటినుంచి మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ మారుతి సుజుకి ఓమ్ని కారు కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల 2019 వ సంవత్సరం మార్కెట్లో నిలిపివేయబడింది. అయితే జూలై 1, 2019 నుండి కంపెనీ నవీకరించబడిన ప్యాసింజర్ వాహన భద్రతా ప్రమాణాలకు అనేక ప్రమాణాలు జోడించబడ్డాయి. కానీ వీటిని మారుతి ఓమ్నికి వర్తించలేదు.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

మారుతి సుజుకి ఓమ్ని అమ్మకానికి ఉన్నప్పుడు, ఇది 5- లేదా 8-సీట్ల వేరియంట్లలో లభించింది. ఇందులో 800 సిసి ఇంజిన్‌ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ 34 బిహెచ్‌పి మరియు 59 ఎన్ఎమ్ టార్క ఉత్పత్తి చేస్తుంది. మారుతి భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న 35 సంవత్సరాలలో దాదాపు 15 మిలియన్ యూనిట్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Maruti Omni Modified With Lambo Style Scissor Door And Chunky Body Kit. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X