Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Motors భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న అధునాతన SUV కొత్త MG Astor. ఈ కొత్త MG Astor దేశీయ మార్కెట్లో 2021 అక్టోబర్ 11 న అధికారికంగా విడుదల కానుంది. ఇది భారతదేశంలో MG మోటార్స్ యొక్క అత్యంత ఆధునిక మరియు పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ కలిగిన దేశంలోనే మొదటి SUV కానుంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

కొత్త MG Astor (ఎంజి ఆస్టర్) భారతదేశంలో కంపెనీ విడుదల చేయనున్న నాలుగవ కారు. జియో యొక్క లాట్ సొల్యూషన్ ద్వారా ఎనేబుల్ చేయబడిన ఐటి సిస్టమ్‌లను కూడా ఇది పొందుతుంది. ఇప్పటికే కంపెనీ ఈ కొత్త SUV యొక్క ఫీచర్స్ మరియు పరికరాలకు సంబంధించిన సమాచారం వెలువడింది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇది దేశీయ మార్కెట్లో అత్యంత పోటీ ధరల శ్రేణిలో విడుదల కానుంది. MG Astor అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను పొందుతుంది. ఈ కారణంగా ఇది ఇతర మిడ్-సైజ్ SUV లతో పోలిస్తే అత్యంత అధునాతనమైనది మరియు అద్భుతమైన డిజైన్ కలిగినది కూడా.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

కంపెనీ ఈ కొత్త అధునాతన SUV లో, రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం ఈ-సిమ్ మరియు లోట్ టెక్నాలజీని అందించింది. ఈ SUV సాఫ్ట్‌వేర్‌లో మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి అనేక కొత్త టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor కలిగి ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ఒకటి. ఇది ఈ SUV లో చాలా ప్రత్యేకమైనది. ఇది లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చిన చిన్న రోబో. ఈ రోబోపై చిన్న స్క్రీన్ ఇవ్వబడింది. ఇది వాయిస్ ద్వారా డ్రైవర్‌ను గుర్తిస్తుంది మరియు వాయిస్ కమాండ్‌లపై పనిచేస్తుంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

ఇందులోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ఆధారంగా సమాచారం మరియు వార్తలను అందిస్తుంది, అదే సమయంలో లోపల కూర్చున్న వ్యక్తులను ఎంటర్టైన్ కూడా చేస్తుంది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీకు సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిన స్టార్ డిజైన్ ఆఫ్ అమెరికా ద్వారా MG ఆస్టర్ యొక్క ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ సిస్టంను తయారు చేసింది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor SUV లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. ADAS వ్యవస్థ అనేది ఒక రాడార్ టెక్నాలజీ, ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీని కంపెనీ తన గ్లోస్టర్ SUV లో ఉపయోగిస్తోంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor లో కంపెనీ అటానమస్ లెవెల్-2 టెక్నాలజీని కూడా ఉపయోగించింది, ఇది ఇప్పటివరకు భారతీయ మార్కెట్‌లో ఏ ఇతర కారులోనూ లేదు. ఇది అధునాతన ఆటోమేటిక్ టెక్నాలజీ, ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా కారును కంట్రోల్ చేస్తుంది. ఈ టెక్నాలజీలతో పాటు, ఈ SUV లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఘర్షణ హెచ్చరిక, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, వెనుక డ్రైవ్ అసిస్ట్, లేన్ ఫంక్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అనేక అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor మంచి డిజైన్ కలిగి ఉంటుంది, ఈ SUV ముందు భాగంలో టంగ్‌స్టన్ స్టీల్ ఫినిష్ రేడియల్ ప్యాట్రన్డ్ గ్రిల్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇందులో సన్నని బంపర్‌లు, షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పునఃరూపకల్పన చేసిన అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ ఉన్నాయి.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. Astor పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి (1.3 లీటర్) టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభ్యం కానుంది.

Astor లాంచ్ డేట్ వెల్లడించిన MG Motors: ఎప్పుడో తెలుసా?

ఇక ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 1498 సిసి (1.5 లీటర్) న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Mg astor to launch on 11th october in india features details
Story first published: Friday, October 8, 2021, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X