రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ గ్లోస్టర్ ధరలను కంపెనీ మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. గత నెలలో హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ధరలను పెంచిన ఎమ్‌జి మోటార్ ఇండియా, ఇప్పుడు తాజాగా గ్లోస్టర్ ధరలను పెంచింది.

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు గరిష్టంగా రూ.80,000 మేర పెరిగాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి మోటార్ ఇండియా బ్రాండ్ నుండి లభిస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో బేస్ మోడల్ (సూపర్ 7-సీటర్) ధరలో ఎలాంటి మార్పు లేదు. కాగా, ‘స్మార్ట్ 6-సీటర్' వేరియంట్ ధరలను మాత్రం రూ.50,000 మేర పెంచారు.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

ఇకపోతే, షార్ప్ వేరియంట్ (6-సీటర్ మరియు 7-సీటర్) ధరలను రూ.70,000 మేర పెంచగా, టాప్-ఎండ్ శావీ ‘6-సీటర్' వేరియంటే ధరను గరిష్టంగా రూ.80,000 మేర పెంచారు. పెరిగిన ధరల మినహా, ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

ఇంజన్, ట్రాన్సిమిషన్ ఆప్షన్స్, ఫీచర్లు మరియు డిజైన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. మునుపటి మాదిరిగానే ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఇంచ్ ఎమ్ఐడితో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-వే పవర్-సర్దుబాటు డ్రైవర్ సీట్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఐ-స్మార్ట్ 2.0 కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MG Gloster New Prices Old Prices
Super 7-Seater ₹29.98 Lakh ₹29.98 Lakh
Smart 6-Seater ₹31.98 Lakh ₹31.98 Lakh
Sharp 7-Seater ₹35.38 Lakh ₹34.68 Lakh
Sharp 6-Seater ₹35.38 Lakh ₹34.68 Lakh
Savvy 6-Seater ₹36.38 Lakh ₹36.08 Lakh

MOST READ:2021 ఏప్రిల్ నెలలో హోండా కంపెనీ విక్రయించిన కార్లు; పూర్తి వివరాలు

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్ యొక్క ‘సూపర్' మరియు ‘స్మార్ట్' వేరియంట్లలో 2.0-లీటర్, సింగిల్-టర్బో, ఇన్‌లైన్-4 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 163 పిఎస్ శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

అలాగే, ఇందులో ‘షార్ప్' మరియు ‘శావీ' వేరియంట్లు కూడా అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ యొక్క ట్విన్-టర్బో వెర్షన్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా ఇవి 218 పిఎస్ శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఒకేరకమైన ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇందులో సింగిల్-టర్బో వెర్షన్ రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది.

రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

కాగా, ఇందులోని ట్విన్-టర్బో మోడల్ మాత్రం స్టాండర్డ్ 4-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Most Read Articles

English summary
MG Gloster Received Second Price Hike This Year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X