Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్‌న్యూస్: జనవరి 7న ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల!
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హెక్టర్‌లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈనెల 7వ తేదీన మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే 2021 ఎమ్‌జి హెక్టర్ మోడల్‌కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

తాజాగా కార్అండ్‌బైక్ నుండి వచ్చిన స్పై చిత్రాలు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయబడిన ఇంటీరియర్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో పాటు ఛార్జింగ్ ప్యాడ్ పక్కన ఉంచిన యుఎస్‌బి పోర్టు కూడా ఉంది.

మునుపటి వెర్షన్‌లో కనిపించిన ఆల్-బ్లాక్ థీమ్ ఇంటీరియర్స్‌తో పోలిస్తే, ఈ కొత్త 2021 మోడల్‌లో డ్యూయల్-టోన్ ఫినిష్‌తో కూడిన ఇంటీరియర్స్ ఉన్నాయి. ఇందులోని కొత్త లేత గోధుమరంగు మరియు నలుపు రంగు (బీజ్ అండ్ బ్లాక్)తో కూడిన డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ఎస్‌యూవీ క్యాబిన్ రూపాన్ని మరింత పెంచుతాయి.
MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. ఈ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్‌ను ఆపరేట్ చేయడానికి సెంటర్ కన్సోల్‌లో ఓ ప్రత్యేకమైన బటన్‌ను కూడా జోడించారు. కస్టమర్ల సౌలభ్యం కోసం ఇందులో స్మార్ట్‌ఫోన్ యుఎస్‌బి ఎ-టైప్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది. ఇంకా ఇందులో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఉంటుందని సమాచారం.

ఎమ్‌జి హెక్టర్ 2021 మోడల్‌లో పైన పేర్కొన్న మార్పుల మినహా మొత్తం క్యాబిన్ లేఅవుట్ అదే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లను మునుపటి వెర్షన్ మోడల్ నుండి అలానే కొనసాగించనున్నారు.
MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

అయితే, ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో బ్రాండ్ యొక్క ఐ-స్మార్ట్ ఏఐ-అసిస్టెడ్ కనెక్టింగ్ టెక్నాలజీకి సంబంధించి సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీని ఉపయోగించే యూజర్లు ఐ-స్మార్ట్ ఫీచర్ల సాయంతో, హెక్టర్ ఎస్‌యూవీలోని ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా 100 కి పైగా ఆదేశాలను (కమాండ్స్‌ని) ఉపయోగించి ఎస్‌యూవీని కంట్రోల్ చేయవచ్చు.

కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎక్స్టీరియర్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇందులో ఇప్పుడు డ్యూయల్-టోన్ ఫినిష్‌తో కూడిన పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు హారిజాంటల్ ప్యాటర్న్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ గ్రిల్ మొదలైనవి ఉన్నాయి. ఈ మార్పుల మినహా దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ అలానే ఉంటుంది.
MOST READ:భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

మునుపటి హెక్టర్ మోడల్‌లో కనిపించిన స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫ్రంట్ బంపర్‌లు, లో ఎయిర్-డ్యామ్, స్ప్లిట్-ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఈ కొత్త 2021 హెక్టర్ మోడల్‌లో కూడా కనిపిస్తాయి. సేఫ్టీ ఫీచర్ల పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. పాత మోడల్ ఆఫర్ చేసిన అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులోనూ లభ్యం కానున్నాయి.

అయితే, మార్కెట్ ఊహాగానాల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీలో ఆఫర్ చేస్తున్న ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్) వంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను ఈ కొత్త 2021 హెక్టర్‌లో ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
MOST READ:రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఇక ఇంజన్ పరంగా కూడా కొత్త ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుత మోడల్‌లో ఉపయోగించిన ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఈ కొత్త మోడల్‌లోనూ కొనసాగించనున్నారు. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 143 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.