ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్; ఎక్కడో తెలుసా?

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ కంపెనీ, ఇటీవల ఫోర్టమ్ ఛార్జ్ మరియు డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌ను పింప్రి చిన్చ్వాడ్ డీలర్‌షిప్‌లో ఏర్పాటు చేశారు.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

ఈ ఛార్జింగ్ స్టేషన్ లో CCS2 (కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్) కు మద్దతిచ్చే ఏదైనా ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయవచ్చు. దీని కోసం కారు యజమాని ఫోర్టమ్ యొక్క మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఛార్జర్‌తో ఎంజి జెడ్ఎస్ ఈవి ని కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం ఫ్రీ ఎసి ఛార్జర్, ప్లగ్-అండ్-ఛార్జ్ కేబుల్ ఆన్‌బోర్డ్‌ను కూడా అందిస్తుంది, దీని సహాయంతో ఈ ఎలక్ట్రిక్ కారును హోమ్ / ఆఫీస్ వద్ద సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అంతే కాకుండా, ఈ కారును రోడ్ సైడ్ అసిస్టెంట్‌తో ప్రయాణంలో కూడా ఛార్జ్ చేయవచ్చు.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

ఎంజి మోటార్ ఇండియా, ఫోర్టమ్‌తో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం గురించి కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ 'గౌరవ్ గుప్తా' మాట్లాడుతూ, ఫోర్టమ్‌తో మా అనుబంధం దేశంలో పర్యావరణ అనుకూల చలనశీలత పరిష్కారాల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. దశలవారీగా మరిన్ని నగరాల్లో ఎంజి జెడ్ఎస్ ఈ లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉందిని కూడా అయన వ్యక్తం చేశారు.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

2021 లో ఆరు నగరాల్లో ఎంజి జెడ్ఎస్ ఈవిని ప్రారంభించిన తరువాత, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు 37 నగరాల్లో అందుబాటులో ఉంది. గ్లోబల్ ఈవి స్పేస్‌లో ప్రముఖ ఈవి ఛార్జింగ్ సర్వీసు ప్రొవైడర్‌లలో ఒకటైన ఎంజి మోటార్ ఇండియా మరియు ఫోర్టమ్ 2019 లో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

కావున అప్పటి నుండి ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు మరియు అహ్మదాబాద్ అంతటా 11 డిసి ఛార్జర్ల నెట్వర్క్ ను ఎంజి మోటార్ మరియు ఫోర్టమ్‌ నిర్మించింది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

ఈ సందర్భంగా ఫోర్టమ్ ఛార్జ్ & డ్రైవ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ 'అవధేష్ కుమార్' మాట్లాడుతూ, దేశంలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలలో ఒకటైన ఎంజి మోటార్స్ తో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం ఆనందంగా ఉంది.

ఫోర్టమ్ భాగస్వామ్యంతో సూపర్ ఫాస్ట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్

ఎంజి మోటార్స్ మరియు ఫోర్టమ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన, ఈ ఛార్జర్‌తో రెండు నగరాల్లో ఫోర్టమ్ ఛార్జర్‌లు ఉన్నందున ఈవి వినియోగదారు ముంబై మరియు పూణే మధ్య ఎటువంటి ఆందోళన లేకుండా ప్రయాణించవచ్చు అని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
MG Motor India And Fortum Set Up A 50 KW Superfast EV Charging Station In Pune. Read in Telugu.
Story first published: Saturday, July 10, 2021, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X