Just In
- 26 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్, భారీ వృద్ధిని నమోదు చేసిన ఎమ్‌జి మోటార్
చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ ఇండియా, గడచిన ఫిబ్రవరి 2021 నెల అమ్మకాల గణాంకాలను ప్రకటించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2021లో ఎమ్‌జి మోటార్ ఇండియా మొత్తం 4,329 యూనిట్ల వాహనాలను విక్రయించి కంపెనీ అత్యధిక రిటైల్ అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు తెలిపింది.

ఫిబ్రవరి 2020 అమ్మకాలతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 715 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం 1,376 కార్లను విక్రయించింది.

ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రోడక్ట్ లైనప్‌లో కంపెనీ విక్రయిస్తున్న హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన అనూహ్య డిమాండ్ కారణంగా, కంపెనీ గడచిన నెలలో అత్యధిక ప్రొడక్షన్, బుకింగ్స్ మరియు సేల్స్‌ను సాధించినట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్మొబైల్; వివరాలు

గడచిన నెలలో ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి 350కి పైగా కొత్త ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. జనవరి 2021 ఆర్డర్లతో పోల్చుకుంటే, ఫిబ్రవరి 2021లో ఈ మోడల్ కోసం వచ్చిన ఆర్డర్ల సంఖ్యగా రెట్టింపుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

మార్చ్ 2021 నెలలో కూడా ఈ వృద్ధి వేగం ఇలానే కొనసాగుతుందని, తమ వాహనాల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీ గట్టిగా పనిచేస్తోందని ఎమ్‌జి మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్) రాకేశ్ సిదానా తెలిపారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవలే తమ హెక్టర్ ఎస్‌యూవీలో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త 2021 హెక్టర్‌కు మార్కెట్ నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం హెక్టర్ 5-సీటర్ ఆప్షన్‌తో లభిస్తుండగా, హెక్టర్ ప్లస్ 6 మరియు 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తోంది.

కొత్త 2021 హెక్టర్ ఇప్పుడు పెట్రోల్ ఇంజన్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా లభిస్తోంది. హెక్టర్ విషయంలో కంపెనీ ఇటీవలే ఓ అరుదైన మైలురాయిని కూడా చేరుకుంది. ఈ మోడల్ యొక్క 50,000వ యూనిట్‌ను కంపెనీ తమ ఫ్యాక్టరీ నుండి బయటకు పంపింది.
MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమ్‌జి మోటార్ ఇండియా తమ 50,000 హెక్టర్ ఎస్‌యూవీని పూర్తిగా మహిళా సిబ్బందితోనే తయారు చేసింది. గుజరాత్‌లోని వడోదరా ప్లాంట్‌లో కంపెనీ ఈ కారును ఉత్పత్తి చేసింది.

ఈ అమ్మకాల విజయం గురించి ఎమ్‌జి మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్) రాకేశ్ సిదానా మాట్లాడుతూ.. 2021లో తమ ఉత్పత్తుల అమ్మకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయిని, ఇప్పుడు ఎక్కువ నగరాల్లో అందుబాటులోకి వచ్చిన తమ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలతో దేశంలో ఈవీల ధోరణి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. మార్చి 2021లో కూడా ఈ అమ్మకాల వృద్ధి ఇలానే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్