ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ హెక్టర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను ఆగస్టు 12వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ఎమ్‌జి హెక్టర్ 'షైన్' పేరుతో విడుదల కానున్న ఈ కొత్త వేరియంట్‌ను మిడ్-లెవల్ ట్రిమ్‌గా అందించనున్నారు.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఇటీవల తమ పాపులర్ హారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీలలో ఎక్స్‌టి+ అనే వేరియంట్‌లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ వేరియంట్లకు పోటీగా ఎమ్‌జి మోటార్ కూడా తమ హెక్టర్ ఎస్‌యూవీలో షైన్ అనే మిడ్-లెవల్ వేరియంట్‌ను ప్రవేశపెడుతోంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలకు కూడా పోటీగా నిలుస్తుంది. ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రస్తుతం హెక్టర్ ఎస్‌యూవీని స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్లలో విక్రయిస్తోంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

కాగా, కొత్తగా ప్రవేశపెట్టబోయే షైన్ వేరియంట్‌ను సూపర్ మరియు స్మార్ట్ వేరియంట్ల మధ్య ఉంచబడుతుంది. ప్రస్తుత సూపర్ వేరియంట్ కంటే ఈ కొత్త షైన్ వేరియంట్‌లో ఎక్కువ ఫీచర్లు లభిస్తాయని ఆశిస్తున్నారు. అదనపు ఫీచర్ల మినహా ఈ కొత్త వేరియంట్‌లో ఇంజన్ మరియు డిజైన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

తాజా సమాచారం ప్రకారం, ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్‌ను కేవలం డీజిల్ ఇంజన్‌తో మాత్రమే అందించే అవకాశం ఉంది. ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

ఎమ్‌జి హెక్టర్ ఇతర ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కూడా లభిస్తోంది. ఇందులోని రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ ఫీచర్లు

ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ కొత్త ట్రిమ్‌లో సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-ఎండ్ షార్ప్ వేరియంట్లో డ్యూయల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్ లభిస్తుంది. హెక్టర్ షైన్ వేరియంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో తెలియజేయనున్నారు.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

కార్ల ధరలను పెంచిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవల భారతదేశంలోని తమ హెక్టర్ శ్రేణి ధరలను పెంచింది. ఈ ఏడాదిలో హెక్టర్ ధరలను పెంచడం ఇది మూడవసారి. గత జనవరి మరియు ఏప్రిల్ నెలలో కంపెనీ ఈ మోడల్ ధరలను పెంచిన విషయం తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.40,000 మేర పెరిగింది. ధరల పెంపు అనంతరం హెక్టర్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.13.50 లక్షలుగా ఉంటే, హెక్టర్ డీజిల్ ప్రారంభ ధర రూ.14.99 (ఎక్స్-షోరూమ్) లక్షలుగా ఉంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

త్వరలోనే ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ లాంచ్

ఎమ్‌జి మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ వెర్షన్ ఎస్‌యూవీ ఎమ్‌జి జెడ్ఎస్‌లో కంపెనీ ఓ పెట్రోల్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ కొత్త పెట్రోల్ వెర్షన్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలో జియో ఆధారిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయని కంపెనీ ధృవీకరించింది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఎమ్‌జి ఆస్టర్ అని పిలవబడుతుందని విశ్వసిస్తున్నారు. ఇది ఈ విభాగంలో నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు త్వరలో ప్రారంభించబోయే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు ధీటుగా నిలుస్తుంది. కాగా, దీనిని కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందించే అవకాశం ఉంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్.. ఆగస్ట్ 12న లాంచ్..

ఎమ్‌జి గ్లోస్టర్ 7-సీటర్ వెర్షన్ విడుదల

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ తమ ప్రీమియం ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో కొత్తగా ఓ 7-సీటర్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎమ్‌జి గ్లోస్టర్ శావీ పేరుతో వచ్చిన ఈ కొత్త 7-సీటర్ వేరియంట్ ధర రూ.37.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఒకే ధర వద్ద ఇది 6 లేదా 7 సీటర్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mg motor india to launch hector shine variant on 12th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X