రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీ అయిన రిలయన్స్ జియోకి భాగస్వామి కానుంది. ఎంజి మోటార్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎస్‌యూవీ కోసం జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఎస్‌యూవీలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఇంగ్లండ్ ఆధారిత వాహన తయారీదారు, భారతీయ ఆధారిత రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని గురించి ఎంజి మోటార్ ఇండియా కంపెనీ తన భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించింది.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

ఎంజి మోటార్ కంపెనీ ఇటీవల కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌గా విక్రయించబడుతున్న జెడ్ఎస్ ఎస్‌యూవీ త్వరలో పెట్రోల్ ఇంజిన్లలో లాంచ్ చేయనుంది. ఈ ఎస్‌యూవీలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

రిలయన్స్ కూడా జియో 5 జి త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. ప్రస్తుతం కంపెనీ వేగవంతమైన 4జి సేవలను అందిస్తోంది. అయితే కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎస్‌యూవీలో ఈ సర్వీస్ అందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని జియోతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

కంపెనీ జియోతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం సుదూర ప్రయాణంలో కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలకు అనుమతిస్తుంది. ఈ భాగస్వామ్యాన్ని అనుసరించి, జియో కొత్త ఎస్‌యూవీ కోసం ఒక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇది రియల్ టైమ్ టెలిమాటిక్స్ సౌకర్యాన్ని అందించగలదు.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జియో సర్వీస్ కేవలం జెడ్ఎస్ ఎస్‌యూవీలో మాత్రమే కాకుండా భవిష్యత్తులో కంపెనీ విడుదల చేసే దాదాపు అన్ని కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతీయ వినియోగదారులు లగ్జరీ వాహనాల మాదిరిగానే హైటెక్ వాహనాలను ఇష్టపడతారు. ఈ కారణంగానే ప్రధాన వాహన తయారీదారులు తమ వాహనాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని నిర్ణయించుకున్నారు.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

ఈ అధునాతన టెక్నాలజీ ప్రపంచంలోని ఏ మూలలోనైనా వాహనం గురించి సమాచారాన్ని అందించగలదు. ఎంజి మోటార్ కంపెనీ 2019 లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ ఆధారిత ఎంజి మోటార్ కంపెనీ ఒక చైనీస్ యాజమాన్యంలోని కంపెనీ. కంపెనీ హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్ఎస్ ఈవి మరియు గ్లోస్టర్ కార్లను విక్రయిస్తుంది.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

జెడ్ఎస్ ఈవి ఎస్‌యూవీ మినహా కంపెనీ యొక్క మిగిలిన కార్లన్నీ కూడా పెట్రోల్‌తో నడిచేవిగానే ఉంటాయి. అయితే జెడ్ఎస్ ఈవి ఎస్‌యూవీ మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ధర రూ. 20.99 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.ఇది దేశీయ మార్కెట్లో చాలా వేగంగా పాపులర్ అయ్యింది.

రిలయన్స్ జియోతో జతకట్టిన ఎంజి మోటార్; దీని వెనుకున్న కారణం ఇదేనా!!

ఇప్పుడు కంపెనీ రూపొందిస్తున్న కారు జెడ్ఎస్ ఈవి ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించబడింది. అయితే దీనిని ఆస్టర్ పేరుతో విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీని కంపెనీ దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది కూడా కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ మాదిరిగానే మంచి అమ్మకాలు చేపట్టనుంది.

Most Read Articles

English summary
Mg motor partners with reliance jio for upcoming new car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X