ఎక్స్‌పీరియన్షియల్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ నిర్వహించిన MG Motor: ఎందుకంటే?

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ ఎంజి గ్లోస్టర్ (MG Gloster) విడుదలతో మరింత ముందుకు సాగింది. ఈ SUV వల్ల మరింత మంచి అమ్మకాలను పొందగలిగింది. భారతీయ మార్కెట్లో మొట్ట మొదటి స్వయంప్రతిపత్త కలిగిన కారుగా ఈ ఎంజి గ్లోస్టర్ ప్రసిద్ధి చెందింది. ఇప్పటికి ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలై ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ MG మోటార్ ఉత్సాహభరితమైన భారతీయ కస్టమర్ల కోసం 4X4 డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నిర్వహించింది.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఎంజి మోటార్స్ యొక్క ఎంజి గ్లోస్టర్ భారతీయ మార్కెట్లో నిరాఘాటంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఈ ఆధునిక SUV మార్కెట్లో ఎంతోమందిని ఆకట్టుకునే దిశగా పురుగులు తీస్తూనే ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, కావున ఎక్కువ మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఎంజి గ్లోస్టర్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు సావి వేరియంట్స్. షార్ప్ మరియు టాప్ ట్రిమ్‌లు సావీ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD)తో అందుబాటులో ఉన్నాయి. సావీ ట్రిమ్‌లో అటానమస్ లెవెల్-1 ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఎంజి గ్లోస్టర్ ఏడు సీట్ల మోడల్ దేశంలోని మొట్టమొదటి అటానమస్ 'లెవల్ 1' ఎస్‌యూవీ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ (ఎపిఎ), ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఎఇబి), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివి ఉంటాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

అంతే కాకుండా ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, ఆటో లెవలింగ్‌తో హెడ్‌ల్యాంప్స్, ఎంజి లోగో ప్రొజెక్షన్‌లతో కూడిన ఓఆర్‌విఎంలు, పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లాంప్స్, స్టీరింగ్-అసిస్ట్ కార్నరింగ్ లాంప్స్, డ్యూయల్ బారెల్ ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఈ ఎస్‌యూవీలో ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో లెదర్ తో చుట్టబడిన సీట్లు, రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు లేటెస్ట్ ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 8 ఇంచెస్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పాడిల్ షిఫ్టర్లు, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

MG గ్లోస్టర్ అన్ని వేరియంట్లలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో స్టాండర్డ్ గా ఉంటుంది. అయినప్పటికీ, సూపర్ మరియు స్మార్ట్ యొక్క బేస్ వేరియంట్లు ఒకే టర్బోచార్జర్‌ను అందుకుంటాయి, టాప్-స్పెక్ షార్ప్ మరియు సావి ట్రిమ్‌లు ట్విన్-టర్బో సెటప్‌ను పొందుతాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

బేస్ వేరియంట్లలోని 2.0-లీటర్ టర్బో డీజిల్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 160 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 375 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్స్‌లోని 2.0-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 216 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క రెండు వెర్షన్లు స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ నాలుగు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి అగాటా రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ కలర్స్. గ్లోస్టర్ ఏడు విభిన్న డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. వీటిలో 'స్నో', 'మడ్', 'సాండ్', 'ఎకో', 'స్పోర్ట్', 'నార్మల్' మరియు 'రాక్' ఉన్నాయి.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

MG గ్లోస్టర్ గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ SUV టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా ఆల్టురాస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. భారతదేశంలో ఈ SUV ప్రారంభ ధర రూ. 29.98 లక్షలు(ఎక్స్-షోరూమ్).

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఇదిలా ఉండగా, ఎంజి మోటార్ కంపెనీ ఇప్పుడు విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీని వినియోగించడానికి శ్రీకారం చుట్టింది. విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీని అవలంబిస్తున్న దేశంలోనే మొదటి కార్ బ్రాండ్‌గా MG Motor అవతరించింది. ఇది నిజంగా ప్రశంసనీయం.

భారత్‌లో సంవత్సరం పూర్తి చేసుకున్న MG Gloster

ఎంజి మోటార్ కంపెనీ తన హలోల్ ప్లాంట్‌లో వినియోగించే శక్తిలో 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుందని పేర్కొంది. గ్రీన్ ఎనర్జీ సాధించేందుకు కంపెనీ రాజ్‌కోట్‌లోని క్లీన్‌మాక్స్ విండ్ సోలార్ హైబ్రిడ్ పార్క్‌తో చేతులు కలిపింది. ఎంజి మోటార్స్ తన హలోల్ ఉత్పత్తి సౌకర్యం కోసం 4.85 MW విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్‌ను పొందనున్నట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mg motors marks gloster suv first anniversary organises adventure drive details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X