ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్న తమ సరికొత్త ఎమ్‌జి జెడ్ఎస్ (MG ZS) పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని 'ఆస్టర్' (Astar) అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఆటోకార్ఇండియా నుండి వచ్చిన నివేదిక ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ కంపెనీ నుండి రాబోయే ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు ఆస్టర్ అని పిలువనున్నారు. కంపెనీ ఇప్పటికే ‘ఆస్టర్' పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసింది

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వేరియంట్ కోసం ఉపయోగించనున్న ఈ కొత్త పేరు, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు నుండి ఈ పెట్రోల్ కారుకి విలక్షణమైన ఉనికిని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ పెట్రోల్ పవర్డ్ ఎమ్‌జి జెడ్ఎస్ (అలియాస్ ఆస్టర్) కారును కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

చైనా కంపెనీ ఈ ఎస్‌యూవీ తయారీలో స్థానికీకరణ శాతాన్ని కూడా పెంచాలని భావిస్తోంది. ఎమ్‌జి ఆస్టర్ తయారీలో అవసరమయ్యే విడిభాగాలను దేశీయ కొనుగోలుదారుల నుండి సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఫలితంగా, ఈ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు, కంపెనీ దీని ధరను చాలా అగ్రెసివ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఎమ్‌జి జెడ్‌ఎస్‌ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది. అంతర్జాతీ మార్కెట్లలో ఈ మోడల్‌ను రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. ఇందులో ఒకటి 1.5-లీటర్ యూనిట్ కాగా, మరొకటి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

అయితే, భారత మార్కెట్ కోసం మాత్రం ఈ ఎస్‌యూవీలో 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. వీటిలో 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పి శక్తిని మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ రెండు ఇంజన్లు కూడా ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ సిగ్నేచర్ హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు డే టైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్-స్టైల్ ర్యాప్అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో అల్యూమినియం ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఎక్స్టీరియర్ డిజైన్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుకా కంపెనీ యొక్క ఐస్‌స్మార్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్లైమేట్ కంట్రోల్, స్టార్ట్ / స్టాప్ బటన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనా.

ఇంకా ఇందులో రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బహుళ ఎయిర్‌బ్యాగులు, హిల్ లాంచ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్స్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో లభించే మోడల్‌లో కనిపించే కొన్ని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు భారతీయ మోడల్‌లో ఉంటాయని సమాచారం.

ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్‌ ఎస్‌యూవీ పేరు 'ఆస్టర్', త్వరలో లాంచ్!?

ఎమ్‌జి మోటార్స్ నుండి రానున్న ఈ సరికొత్త ఆస్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, కంపెనీ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనో డస్టర్, నిస్సాన్ కిక్ మరియు త్వరలో రానున్న స్కొడా కుషాక్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

Most Read Articles

English summary
MG Motor Trademarks Astor Name; Could Be Assigned To ZS Petrol Version, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X