భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్న సమయంలో ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ MINI India కూడా తన బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త MINI Electric యొక్క బుకింగ్స్ అధికారికంగా ప్రారభించింది. ఈ MINI Electric కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI India తన కొత్త MINI Electric కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కంపెనీ యొక్క మినీ కూపర్‌పై ఆధారపడి ఉంటుంది. త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త MINI Electric 3-డోర్ కూపే మోడల్.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI Electric కారు తక్షణ టార్క్‌ అందిస్తుంది, కావున ఇది సున్నా ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఈ కారణంగా, ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ కూడా ఉండదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 184 బిహెచ్‌పి పవర్ మరియు 270 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI Electric కారు 32.6 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీతో శక్తిని పొందుతుంది. కావున ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 270 కి.మీ వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో MINI India మంచి ప్రజాదరణ పొందింది. కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో MINI 3-డోర్ హాచ్, MINI జాన్ కూపర్ వర్క్స్ హాచ్, MINI కన్వర్టిబుల్ మరియు MINI కంట్రీమ్యాన్‌ వంటి మోడల్స్ విక్రయిస్తుంది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లో ప్రవేశపెట్టలేదు, కావున ఇప్పుడు మొదటిసారి కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్, వోల్వో మరియు ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలు కూడా తమ బ్రాండ్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ లగ్జరీ సెగ్మెంట్లో ఇప్పుడు MINI కూడా స్థానం సంపాదించుకుంది.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MINI Electric అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి దాదాపు దాని మినీ కూపర్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులోని ఫ్రంట్ గ్రిల్ కారుని మరింత ఏరోడైనమిక్‌గా చేస్తుంది. అంతే కాకుండా ఇందులో కొన్ని ఆకర్షణీయమైన ఎల్లో కలర్ యాక్సెంట్ బార్ మరియు మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్‌లు ఉంటాయి.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో రౌండ్ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పసుపు రంగు రిమ్‌లతో కూడిన కొత్త 17-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను పొందింది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది కాకుండా, కారు పిల్లర్లు అన్ని కలర్ ట్రిమ్‌లలో బ్లాక్ కలర్ లో ఉంచబడ్డాయి, ఇది కారుకు మంచి కాంట్రాస్ట్‌ని ఇస్తుంది.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI India ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధరను ఇక అధికారికంగా ప్రకటించలేదు. అయితే కంపెనీ ఈ మోడల్ ధరను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రకటించే అవకాశం ఉంటుంది. కంపెనీ అందించిన సమాహారం ప్రకారం MINI India మొదటి బ్యాచ్‌లో భారతదేశానికి 30 యూనిట్లు మాత్రమే కేటాయించబడతాయి, అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుండి ప్రారంభమవుతాయి.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI కూపర్ SE ప్రపంచవ్యాప్తంగా 2019లో పరిచయం చేయబడింది. MINI కూపర్ SE భారతదేశంలో విక్రయించబడుతున్న BMW గ్రూప్ నుండి మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. MINI ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కానుంది. ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి, అయితే దీనికి మార్కెట్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

భారత మార్కెట్లో MINI Electric బుకింగ్స్ స్టార్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

MINI భారతదేశంలో తొమ్మిది అధీకృత డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. అవి బర్డ్ ఆటోమోటివ్ (ఢిల్లీ NCR), బవేరియా మోటార్స్ (పుణె), EVM ఆటోక్రాఫ్ట్ (కొచ్చి), గాలప్స్ ఆటోహాస్ (అహ్మదాబాద్), ఇన్ఫినిటీ కార్స్ (ముంబై), కృష్ణ ఆటోమొబైల్స్ (చండీగఢ్), KUN ఎక్స్‌క్లూజివ్ (చెన్నై ), KUN ఎక్స్‌క్లూజివ్ (హైదరాబాద్) మరియు నవ్‌నీత్ మోటార్స్ (బెంగళూరు) వంటి నగరాల్లో ఉన్నాయి.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
Mini electric car booking starts range features details
Story first published: Friday, October 29, 2021, 14:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X