Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

సాధారణ ప్రజలకంటే సెలబ్రెటీలకు కార్లపైన ఎక్కువ వ్యామోహం ఉంటుందనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే చాలామంది సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొత్త మరియు ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మలయాళ హాస్యనటుడు 'హరీష్ కనరన్' జీప్ కంపెనీ యొక్క కంపాస్ SUV కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్యనటుడు అయిన హరీష్ కనరన్ చాలామంది అభిమానించే వ్యక్తి. యితడు ఇటీవల విలాసవంతమైన జీప్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఈ కొత్త కారును అతడు తన కుటుంబంతో కలిసి డెలివెరీ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

జీప్ కంపాస్ డెలివెరీ ఫోటోలను పంచుకుంటూ, జీప్ లైఫ్ మరియు న్యూకార్ హ్యాష్‌ట్యాగ్‌లతో చిత్రాలను పోస్ట్ చేశారు. అంతే కాకుండా దీనిని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

హరీష్ కనరన్ ఇప్పటికే ఒక జీప్ కంపాస్ కలిగి ఉన్నారు. ఈయన మొదటి సారి జీప్ కంపాస్‌ను 2018 వ సంవతసరంలో కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు అప్డేటెడ్ జీప్ కంపాస్ SUV కొన్నారు. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

హరీష్ కనరన్ కొనుగోలు చేసిన జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ SUV విషయానికి వస్తే, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలైంది. ఇది చాలావరకు ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ అప్డేట్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త జీప్ కంపాస్ SUV స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్, లిమిటెడ్ (ఓ) మరియు కొత్తగా జోడించిన టాప్-ఎండ్ మోడల్ S వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన 2021 జీప్ కంపాస్ SUV డిజైన్, కొన్ని చిన్న అప్‌డేట్‌లతో ఫీచర్ల విభాగంలో కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. ఈ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ SUV లోపలి భాగంలో సూక్ష్మమైన అప్‌డేట్‌లు మరియు మార్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

కొత్త జీప్ కంపాస్ యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో సవరించిన హెడ్‌లైట్లు, హానీ కూంబ్ ఇన్సర్ట్‌లతో అప్డేట్ చేసిన 7 స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్‌ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీకి కొత్త అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ ఎస్‌యూవీ యొక్క వెనుక వైపు పెద్దగా మార్పు జరగలేదు.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క లోపలి భాగం ఎక్కువగా అప్డేట్ చేయబడింది, ఇందులో కొత్త ఫ్లోటింగ్ 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజింగ్‌తో ఉంటుంది, వీటి క్రింద స్లిమ్ ఎసి వెంట్స్ మరియు హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ యొక్క డాష్‌బోర్డ్‌లో డబుల్-స్టిచ్చింగ్ బ్రౌన్ లెదర్ ఇన్సర్ట్‌లను మరియు బ్రష్ చేసిన అల్యూమినియం లాంటి ట్రిమ్‌ను కూడా పొందుతుంది.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద, పుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, టాప్-స్పెక్ కంపాస్ 'సీట్లు డ్యూయల్-టోన్ లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది, అయితే లోయర్ వేరియంట్లలో ఆల్-బ్లాక్ అప్హోల్స్టరీ మాత్రామే లభిస్తుంది.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్‌లో 10.1-టచ్‌స్క్రీన్ ఉంది, ఇది ఎఫ్‌సిఎ యొక్క యుకనెక్ట్ 5 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌ను పొందుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఓవర్-ది-ఎయిర్ (OTA) నవీకరణలను కూడా పొందవచ్చు.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, లెదర్ అప్హోల్స్టరీ, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

కంపాస్ లిమిటెడ్ ప్లస్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇఎస్‌సి, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్ ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.

Jeep బ్రాండ్ యొక్క మరో ఎస్‌యూవీ సొంతం చేసుకున్న హరీష్ కనరన్: పూర్తి వివరాలు

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న 2.0 డీజిల్ ఇంజిన్ ‌తో 173 హెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.4 టర్బో పెట్రోల్ ఇంజిన్163 హెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్‌తో స్టాండర్డ్ గా వస్తాయి. అయితే కంపాస్ పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అప్సన్ ని మరియు డీజిల్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో ఆప్షన్‌ను పొందుతుంది. కంపాస్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో సర్ఫేస్ స్పెసిఫిక్ డ్రైవ్ మోడ్‌లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Mollywood actor hareesh kanaran bought new jeep compass suv details
Story first published: Wednesday, December 8, 2021, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X