భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ తమ సరికొత్త 'ఎఫ్-పేస్' లగ్జరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ.69.99 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది మునుపటి మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాకపోతే, ఇందులో మొదటిసారిగా ఆర్-డైనమిక్ ట్రిమ్‌ కంపెనీ పరిచయం చేసింది.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

జాగ్వార్ ఎఫ్-పేస్ ఆర్-డైనమిక్ వేరియంట్ మరింత పెర్ఫార్మెన్ ఓరియెంటెడ్ ఎస్‌యూవీగా ఉంటుంది మరియు స్టాండర్డ్ ఎఫ్-పేస్‌తో పోల్చుకుంటే కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ ఎక్స్టీరియర్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇందులో జాగ్వార్ యొక్క హెరిటేజ్ లోగో-ప్రేరేపిత 'డైమండ్' డీటేలింగ్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

సైడ్ ఫెండర్ వెంట్స్, 'డబుల్ జె' డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్‌ఎల్)తో కూడిన పూర్తి ఎల్ఇడి క్వాడ్ హెడ్‌లైట్లు, వెనుక వైపు కొత్త స్లిమ్-లుకింగ్ హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ బంపర్ మరియు క్రోమ్-ఎగ్జాస్ట్ టిప్స్‌తో పాటుగా మరికొన్ని మార్పులు ఉన్నాయి. అయితే, కొత్త ఎఫ్-పేస్ యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్‌లో మాత్రం ఎలాంటి మేజర్ మార్పు కనిపించదు.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

కంపెనీ పేర్కొన్న ప్రకారం, కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ యొక్క ఇంటీరియర్స్ కూడా మెరుగైన లగ్జరీ మరియు కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులోని క్యాబిన్ ఇప్పుడు ప్రత్యేకమైన, స్పోర్టీ మరియు విలాసవంతమైన అనుభూతి కోసం మార్స్ రెడ్ మరియు సియానా టాన్ అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

కొత్త 2021 మోడల్ జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ క్యాబిన్ లోపల లెదర్ ట్రిమ్‌తో తయారు చేసిన కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త 11.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త పివి ప్రో టెక్నాలజీ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ ఏసి కోసం కొత్త కంట్రోల్స్, సిగ్నేచర్ జాగ్వార్ చిహ్నంతో కూడిన కొత్త హెడ్‌రెస్ట్స్ మరియు కొత్త ఇంటీరియర్ ట్రిమ్మింగ్స్ కూడా ఉంటాయి.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

ఇంకా ఇందులో కొత్త డ్రైవ్ సెలెక్టర్, 360-డిగ్రీ గ్రాబ్ హ్యాండిల్, పవర్-ఆపరేటెడ్ సెకండ్-రో సీట్లు రిక్లైనింగ్ ఫంక్షన్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫిక్స్‌డ్ పనోరమిక్ రూఫ్, 3డి సరౌండ్ కెమెరా, ప్రీమియం మెరిడియన్ ఆడియో సిస్టమ్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ప్యాడల్ షిఫ్టర్లతో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

భారత మార్కెట్లో 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 4,250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 201 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ మరియు 2,500 ఆర్‌పిఎమ్ మధ్య 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

అలాగే, ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 246 బిహెచ్‌పి శక్తిని మరియు 1,300-4,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 365 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ పెట్రోల్ వెర్షన్ గరిష్టంగా గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకోవటానికి 8 సెకన్ల సమయం పడుతుంది. అదే డీజిల్ వెర్షన్ అయితే ఈ వేగాన్ని 7.3 సెకన్లలో సాధిస్తుంది. అదేవిధంగా, ఎఫ్-పేస్ పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్ల గరిష్ట వేగాన్ని వరుగా 210 కిలోమీటర్లు మరియు 217 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల: ధర, వివరాలు

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్‌యూవీ ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఆడి క్యూ5, రేంజ్ రోవర్ ఎవోక్, వోల్వో ఎక్స్‌సి 60 మరియు లెక్సస్ ఎన్‌ఎక్స్300హెచ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 Jaguar F-Pace Launched In India: Price, Specs, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X