కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను విడుదల చేసిన తర్వాత, తాజాగా తమ సరికొత్త కాంపాక్ట్ ఎమ్‌పివి ట్రైబర్‌లో ఫేస్‌‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త రిఫ్రెష్డ్ రెనో ట్రైబర్ ఎమ్‌పివి ప్రారంభ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

రెనో ఇండియా తమ ట్రైబర్ ఎమ్‌పివిని తొలిసారిగా 2019లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఇందులో అప్‌డేటెడ్ వెర్షన్ రావటం ఇదే మొదటిసారి. మునుపటితో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 రెనో ట్రైబర్ ఎమ్‌పివిలో కంపెనీ అనేక అధనపు ఫీచర్లను జోడించింది. ఆ వివరాలేంటో, ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

రెనో ట్రైబర్ ఎమ్‌పివి ఇప్పటి వరకూ సింగిల్ కలర్ స్కీమ్‌తో లభించేంది. ఈ కొత్త 2021 ట్రైబర్ ద్వారా కంపెనీ డ్యూయెల్ టోన్ కలర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు ఐదు డ్యూయల్-టోన్ షేడ్‌లతో లభిస్తుంది. అన్ని వేరియంట్లు ఇప్పుడు బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్‌ను కలిగి ఉంటాయి.

MOST READ:కొచ్చిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

కొత్త రెనో 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లను జోడించడంతో పాటుగా, కంపెనీ ఇందులో ఓ సరికొత్త కలర్ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇిద సీడర్ బ్రౌన్ కొత్త కలర్‌లో లభిస్తుంది. ఇది కాకుండా, ట్రైబర్ మెటల్ మస్టర్డ్, మూన్‌లైట్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఐస్ కూల్ వైట్ కలర్ స్కీమ్‌లలో కూడా అందుబాటులో ఉంది.

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

ఎక్స్టీరియర్లలో చేసిన ఇతర మార్పులలో, సైడ్ మిర్రర్స్ ఇప్పుడు బ్లాక్ కలర్‌లో లభిస్తాయి. బాడీ కలర్ పెయింట్ స్కీమ్‌తో సంబంధం లేకుండా రెనో ట్రైబర్ ఎమ్‌పివి సైడ్ మిర్రర్లు బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో సైడ్ మిర్రర్లపై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు కూడా లభిస్తాయి.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

క్యాబిన్ లోపల చేసిన మార్పులను గమనిస్తే, ఇందులోని స్టీరింగ్ వీల్ ఇప్పుడు ఆడియో కంట్రోల్స్‌తో పాటుగా ఫోన్ కంట్రోల్ బటన్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులోని డ్రైవర్ సీటు ఆరు-రకాలు సర్దుబాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. వీటితోపాటుగా కొత్త ట్రైబర్ ఎమ్‌పివిని డ్యూయెల్ హారన్ ఫీచర్‌తో అందిస్తున్నారు.

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

ఈ కొత్త మోడల్‌లో చేసిన అదనపు మార్పులు చేర్పులు కారణంగా, 2021 ట్రైబర్ ఎమ్‌పివి ధరలు కూడా మునుపటి కన్నా రూ.15,000 మేర పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.5.30 లక్షల నుండి రూ.7.82 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

కాగా, కొత్త రెనో ట్రైబర్ ఎమ్‌పివి ఇంజన్‌లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇదివరకటి 1.0-లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 ట్రైబర్ ఎమ్‌పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్

రెనో ట్రైబర్ ఎమ్‌పివి ఈ విభాగంలో డాట్సన్ గో ప్లస్ (రూ.4.25 లక్షల నుండి రూ.6.99 లక్షలు)కి దగ్గర పోటీగా ఉంటుంది. ధరల పరంగా చూస్తే, ఇటీవల అప్‌గ్రేడ్ చేయబడిన మారుతి సుజుకి స్విఫ్ట్ (రూ.5.73-8.41 లక్షలు), ఫోర్డ్ ఫిగో (రూ.5.64-7.09 లక్షలు), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (రూ.5.19-7.86 లక్షలు) మరియు మారుతి ఎర్టిగా (రూ.7.69-10.47 లక్షలు) వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

MOST READ:చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
New 2021 Renault Triber Gets More Features, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X