దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి, తన కొత్త ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఆడి కంపెనీ ఇటీవల ఈ కొత్త కారు యొక్క టీజర్ విడుదల చేసింది. ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఆడి ఈ-ట్రోన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ కారు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ యొక్క మూడవ ఎలక్ట్రిక్ మోడల్. భారతీయ లగ్జరీ మార్కెట్‌లో ఆడి అతిపెద్ద ఈవి పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. ఆడి ఈ-ట్రోన్ జిటి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆడి ఈ-ట్రోన్ జిటి కారు సిబియు యూనిట్‌గా భారతీయ మార్కెట్‌లో రానుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఆడి ఈ-ట్రోన్ జిటి రెండు వేరియంట్లలో భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన కాన్సెప్ట్ 2018 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ప్రదర్శించబడింది. ఈ మోడల్ చాలా ఆకర్షణీయంగా మంచి వైఖరితో భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. ఈ కారు చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

కొత్త ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ బోనెట్‌పై పెద్ద ఇండెంటేషన్ మరియు గ్రిల్‌కు బదులుగా ఇ-ట్రోన్ ప్యానెల్ ప్యానెల్ ఉంటుంది. మ్యాట్రిక్స్ కూపే ఆర్ఎస్ వెర్షన్‌లోని ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అయితే ఆడి లేజర్ లైట్ రెండు వేరియంట్‌లలో ప్రామాణికమైనదిగా ఉంటుంది. ఆడి ఈ-ట్రోన్ జిటిలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ఏరో బ్లేడ్‌లతో 21 ఇంచెస్ అల్లాయ్ వీల్ ఎంపికను కూడా కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఈ-ట్రోన్ జిటి కారు లోపల ఒక పెద్ద 12.3 ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్ కన్సోల్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ప్రామాణికంగా వస్తుంది. ఈ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్ మరియు ఆడి కనెక్టివిటీ ఉన్నాయి. పవర్ ఫుల్ డిసి ఛార్జింగ్ పాయింట్‌లలో తక్కువ స్పీడ్ ఛార్జింగ్ స్టాప్‌లతో వేగవంతమైన మార్గాన్ని లెక్కించడానికి ఇది ఈ-ట్రోన్ రూట్ ప్లానర్‌ని కూడా అందుకుంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

రియర్ యాక్సిల్ రెండు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మరియు ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్‌తో జత చేయబడింది. ఈ-ట్రోన్ జిటి స్టాండర్డ్ మోడల్‌లోని ఎలక్ట్రిక్ మోటార్లు 350 కిలోవాట్ వరకు ఉంటాయి. ఇవి 469 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

అదేవిధంగా ఆర్ఎస్ జిటి స్టాండర్డ్ వేరియంట్ లో ఉన్న 440 కిలోవాట్ బ్యాటరీ 590 బిహెచ్‌పి పవర్ మరియు 830 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఈ-ట్రోన్ జిటి స్టాండర్డ్ వేరియంట్ 4.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కొత్త ఈ-ట్రోన్ జిటి యొక్క గరిష్ట వేగం గంటకు 245 కిమీ.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

అదేవిధంగా ఇందులోని ఆర్ఎస్ వేరియంట్ 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. ఈ మోడల్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 488 కిలోమీటర్లు. ఇది మంచి పర్ఫామెన్స్ అందించడంతో పాటు వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఆడి కంపెనీ ఇటీవల తన ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఆడి ఆర్ఎస్5 ధర దేశీయ మార్కెట్లో రూ. 1.04 కోట్లు. ఈ కొత్త కారు నార్డో గ్రే, టర్బో బ్లూ, టాంగో రెడ్, మిథోస్ బ్లాక్, గ్లేసియర్ వైట్, నవర్రా బ్లూ, సోనోమా గ్రీన్ మరియు డేటోనా గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వి6 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 443 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఇందులో మంచి ఫీచర్స్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా 6 ఎయిర్‌బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, యాంటీ-థెఫ్ట్ వీల్ బోల్ట్‌లు, హోల్డ్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ టీజర్‌; చూసారా!!

ఆడి ఇ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ కారులో డ్రైవ్ సెలెక్ట్, ఆల్-వీల్ స్టీరింగ్, కంట్రోల్డ్ డంపింగ్, త్రీ-ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్, రియర్-యాక్సిల్ డిఫరెన్షియల్ లాక్ మరియు ఆప్సనల్ కార్బన్-ఫైబర్ సిరామిక్ డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లతో పాటు అధునాత టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది. త్వరలో ఇది దేశీయ మార్కెట్లో విడుదల కానుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New audi e tron gt electric sedan teaser out ahead of launch details
Story first published: Wednesday, August 18, 2021, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X