YouTube

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ భారత ఆటోమొబైల్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. గడచిన ఏప్రిల్-మే మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కారణంగా అనేక కొత్త కార్ల విడుదలలు వాయిదా పడ్డాయి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

అయితే, ఈ జూన్ నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో, దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ సమయాల్లో సడలింపులు చేశారు. ఈ నేపథ్యంలో, దేశీయ మరియు అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. మరి జూన్ 2021లో మన మార్కెట్లో విడుదలైన ఆ కొత్త కార్ల వివరాలేంటో చూద్దాం రండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

1. హ్యుందాయ్ అల్కాజార్

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కార్లలో అల్కాజార్ కూడా ఒకటి. పాపులర్ హ్యుందాయ్ క్రెటా ప్లాట్‌ఫాంపై తయారైన 6-సీటర్ మరియు 7-సీటర్ హ్యుందాయ్ అల్కజార్‌ను రూ.16.30 లక్షల నుండి రూ.20.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో విడుదల చేశారు. ఇధి ఈ విభాగంలో టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో 1.5-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, సిగ్నేచర్ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఆల్కాజార్ కంపెనీ తాజాగా యాక్ససరీ ప్యాక్ వివరాలను కూడా వెల్లడి చేసింది. వీటి ధరలు రూ.12,715 నుండి రూ.30,898 మధ్యలో ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

2. స్కొడా కుషాక్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, ఎంతో కాలంగా భారతీయులను ఊరిస్తూ వచ్చిన మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ కుషాక్‌ను కంపెనీ ఎట్టకేలకు ఈ జూన్ నెలలో మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెటల్ స్కొడా కుషాక్ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.17.60 లక్షలక (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. స్కొడా కుషాక్ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

స్కొడా కుషాక్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో, రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇది యాంబియంట్, అంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ఈ కారుని మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. స్కొడా కుషాక్ పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

3. కొత్త 2021 స్కొడా ఆక్టేవియా

స్కొడా ఆటో ఇండియా నుండి ఈ జూన్ నెలలో మార్కెట్లోకి విడుదలైన మరొక కారు కొత్త 2021 ఆక్టేవియా సెడాన్. నవంబర్ 2019 నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన ఈ నాల్గవ తరం స్కొడా ఆక్టేవియాను కంపెనీ తాజాగా భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది. కొత్త ఆక్టేవియా సెడాన్‌ను స్టైల్ మరియు ఎల్ అండ్ కె (లౌరిన్ అండ్ క్లెమెంట్) అనే రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల చేశారు. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.25.99 లక్షలు మరియు రూ.28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

ఈ రెండు వేరియంట్లు కూడా 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తోనే లభిస్తాయి. ఇది 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌గా గేర్‌బాక్స్‌తో లభిస్తుంది, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు. ఈ కారులో పూర్తి ఎల్‌ఈడి లైటింగ్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ ఎలంట్రా వంటి కార్లతో పోటీ పడుతుంది. ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ కారును టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. - ఈ కారు యొక్క పూర్తి సమీక్షను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

4. జాగ్వార్ ఎఫ్-పేస్

టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ తమ సరికొత్త 'ఎఫ్-పేస్' లగ్జరీ ఎస్‌యూవీని కూడా ఈ జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ.69.99 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. జాగ్వార్ ఎఫ్-పేస్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్స్‌లో లెదర్ ట్రిమ్‌తో తయారు చేసిన కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త 11.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త పివి ప్రో టెక్నాలజీ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ ఏసి కోసం కొత్త కంట్రోల్స్, సిగ్నేచర్ జాగ్వార్ చిహ్నంతో కూడిన కొత్త హెడ్‌రెస్ట్స్ మరియు కొత్త ఇంటీరియర్ ట్రిమ్మింగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

5. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) బ్రాండ్ భారత మార్కెట్లో విడుదలైన మరొక కొత్త మోడల్ 'రేంజ్ రోవర్ వెలార్'. దేశీయ విపణిలో ఈ కొత్త 2021 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర రూ.79.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లోనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇది కూడా జాగ్వార్ ఎఫ్-పేస్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో కొత్తగా ఆర్-డైనమిక్ ఎస్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టారు.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

ఈ 2021 రేంజ్ రోవర్ వెలార్‌లో కంపెనీ అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించింది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 246 హెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 8.20 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

6. కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) బ్రాండ్ నుండి ఈ నెల భారత మార్కెట్లోకి వచ్చిన మూడవ ఉత్పత్తి సరికొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని కంపెనీ శక్తివంతమైన 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టింది. ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి 'స్పెషల్ వెహికల్' ఆపరేషన్స్ విభాగం ఈ ఎస్‌విఆర్ వేరియంట్‌ను రూపొందించింది. ఇది ఇప్పటివరకు సంస్థ నిర్మించని అత్యంత శక్తివంతమైన ల్యాండ్ రోవర్ కారుగా ఉంటుంది.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

భారత మార్కెట్లో ఇది ఒకే వేరియంట్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలోని పవర్‌ఫుల్ 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 567 బిహెచ్‌పి శక్తి మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 283 కిలోమీటర్లుగా ఉంటుంది. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

7. కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో తమ కొత్త 2021 ఎస్-క్లాస్ సెడాన్‌ను కూడా ఈ జూన్ నెలలోనే విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఎస్400డి 4-మ్యాటిక్ మరియు ఎస్450 4-మ్యాటిక. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.2.17 కోట్లు మరియు రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని కూడా జోడించింది.

జూన్ 2021 నెలలో విడుదలైన కొత్త కార్లు ఏవో తెలుసా?

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 3.0-లీటర్ పెట్రోల్ మరియు 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ లగ్జరీ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటుంది. ఇది భారత మార్కెట్లో ఆడి ఏ8 మరియు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లకు పోటీగా నిలుస్తుంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New Car Launches In India In June 2021: Hyundai Alcazar, Skoda Kushaq, New Mercedes-Benz S-class And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X