జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

దేశీయ ఆటోమొబైల్ సంస్థ ఫోర్స్ మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిఎస్6 ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విడుదల కానుంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని కంపెనీ 15 నెలల క్రితం 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

అయితే, అనేక కారణాల వలన ఈ మోడల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా ఇప్పుడు 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎప్పుడైనా విడుదల కావచ్చని పరిశ్రమ వర్గాల సమాచారం.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

దాదాపు ఏడాదిన్నరకు పైగా వేచి చూస్తున్న మహీంద్రా థార్ పోటీదారు ఫోర్స్ గుర్ఖా ఈ సంవత్సరం జూలై మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశంలోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ యొక్క టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్స్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పెద్ద వీల్ ఆర్చెస్‌తో రగ్గడ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇదివరకు చూసిన ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీల కన్నా ఇది చాలా భిన్నంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

ఇంకా ఇందులో రీడిజైన్ చేయబడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్స్ వంటి మార్పులు కూడా ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో 245/70 టైర్ ప్రొఫైల్స్‌తో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఈ మార్పులతో ఇది మునుపటి కన్నా మరింత మెరుగైన రోడ్-ప్రెజెన్స్‌ను కలిగి ఉంటుంది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, డాష్‌బోర్డ్ మధ్యలో సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

అంతేకాకుండా, ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలో రెండవ వరుసలో ప్రయాణీకుల కోసం వ్యక్తిగత సీట్లు మరియు కొత్తగా డిజైన్ చేసిన గుండ్రటి ఏసి వెంట్స్ వంటి మార్పులు ఉండన్నాయి. ఈ బిఎస్6 వెర్షన్ ఫోర్స్ గూర్ఖా మొదటి మరియు రెండవ వరుసలో నాలుగు ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లతో ఒకే సీటింగ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఎస్‌యూవీ బూట్‌ స్పేస్‌లో ఒకదానికొకటి ఎదురుగా మరో రెండు సీట్లు కూడా ఉంటాయి.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

సీటింగ్ పరంగా చూసుకుంటే, కొత్త తరం మహీంద్రా థార్ కన్నా కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ 6-సీటర్ లేదా 7-సీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసుకోవాలనుకునే వారి కోసం కంపెనీ అనేక ఫ్యాక్టరీ ఒరిజినల్ యాక్ససరీలను కూడా అందించే అవకాశం ఉంది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

ఈ అఫీషియల్ యాక్ససరీస్‌లో విండ్‌షీల్డ్ ప్రొటెక్టర్ ఫ్రేమ్, రూఫ్ ర్యాక్ మరియు సైడ్ స్టెప్ మొదలైనవి ఉన్నాయి. ఈ కారు లాంచ్ సమయంలో మరిన్ని యాక్ససరీల వివరాలు వెల్లడి కావచ్చు. ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ బిఎస్-6 కంప్లైట్ 2.6-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

జులై-సెప్టెంబర్ 2021 మధ్యలో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ లాంచ్; డీటేల్స్!

ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా స్టాండర్డ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కావచ్చని సమాచారం. ఇందులో మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలపై ప్రయాణించేందుకు వీలుగా లో-రేంజ్ గేర్‌బాక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

Most Read Articles

English summary
New Force Gurkha SUV Might Arrive In Second Quarter Of FY 2022, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X