Just In
- 51 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు, ఎప్పుడంటే..?
టాటా అభిమానులకు ఇది గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎస్‌యూవీ అభిమానులను ఊరిస్తూ వస్తున్న కొత్త టాటా సఫారీ ఎస్‌యూవీని కంపెనీ ఈనెల 22వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త 2021 టాటా సఫారీ కోసం కంపెనీ ఇప్పటికే అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

కొత్త తరం టాటా సఫారీని ఫిబ్రవరి 22, 2021వ తేదీన కొనుగోలుదారులకు అందుబాటులోకి తెస్తామని, దీని ధర ఇతర వివరాలను కూడా అదే రోజున వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ఈ కొత్త సఫారీని XE, XM, XTCHI, XT+, XZ మరియు XZ+ అనే ఆరు వేరియంట్లలో విడుదల చేయనుంది.

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త తరం సఫారీని తయారు చేసింది. ముందు వైపు నుండి చూడటానికి ఈ రెండు మోడళ్లు ఒకేలా కనిపిస్తాయి. అయితే, సఫారీ ఫ్రంట్ గ్రిల్ హారియర్ కన్నా భిన్నంగా ఉంటుంది.
MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

టాటా సఫారీ ఎస్‌యూవీని 6 సీట్లు మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో అందించనున్నారు. ఆరు సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి, అలాగే ఏడు సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో బెంచ్ సీట్ ఉంటుంది. ఈ కొత్త తరం టాటా సఫారీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ రిపోర్ట్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త 2021 టాటా సఫారీలో 18 ఇంచ్ మెషీన్డ్ అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన సైడ్ మిర్రర్స్, ఫ్రట్ బంపర్ మరియు విండోస్‌పై క్రోమ్ లైన్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ హెడ్‌ల్యాంప్ సెటప్, సన్నటి ఎల్ఈడి డిఆర్ఎల్స్, బ్లాక్ అవుట్ ఎల్ఈడి టెయిల్ లాంప్స్ మరియు రియర్ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి.
MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ప్రీమియం లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, బ్లాక్ అండ్ బేజ్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ క్యాబిన్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్ మరియు డోర్ ప్యానెళ్లపై సిల్వర్ యాక్సెంట్స్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇందులో 9 జెబిఎల్ స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ ఏసి వెంట్స్, మల్టిపుల్ యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

కొత్త టాటా సఫారీలోని అప్‌గ్రేడ్ చేయబడిన కార్ కనెక్ట్ టెక్నాలజీ ఇంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ భాషలో వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్‌తో, హిల్ అసిస్ట్ కంట్రోల్, చైల్డ్ సీట్ ఐసోఫిక్స్ మొదలైనవి ఉన్నాయి.

అంతేకాకుండా, ఈ కారులో రియర్ పార్కింగ్ సెన్సార్స్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త టాటా సఫారిలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో టాటా సఫారీ ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యువి 500 లతో పాటుగా రాబోయే 7 సీట్ల హ్యుందాయ్ క్రెటా మరియు 7 సీట్ల జీప్ కంపాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.