భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) తన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (Volkswagen Tiguan) ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 31.99 లక్షలు. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ఉత్పత్తి ప్రారంభించబడింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

Volkswagen Tiguan కలర్ అప్సన్స్:

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మొత్తం 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.ఇందులో

 • నైట్‌షేడ్ బ్లూ
 • ప్యూర్ వైట్
 • డీప్ బ్లాక్
 • ఓరెక్స్ వైట్
 • డాల్ఫిన్ గ్రే
 • రిఫ్లెక్స్ సిల్వర్
 • కింగ్స్ రెడ్
 • భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  ఈ కొత్త కారు యొక్క టెస్ట్ డ్రైవ్స్ 2021 డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. అయితే ముందుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో టెస్ట్ డ్రైవ్‌లకు అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత ఇతర నగరాలకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా త్వరలో ఇది దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు డెలివరీ చేస్తుంది, తరువాత బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయబడుతుంది.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  Volkswagen Tiguan డిజైన్:

  కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ డిజైన్ విషయానికి వస్తే, ఇది ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటు అప్‌డేట్ చేయబడిన బంపర్ హౌసింగ్ మరియు త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్‌లతో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  ఈ కొత్త కారు యొక్క ముందు మరియు వెనుక భాగంలో LED లైటింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీని సైడ్ ప్రొఫైల్ భాగంలో షార్ప్ లైన్స్ ఉంటాయి. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇందులో అవసరమైనంత బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. కావున కావాల్సిన లగేజ్ తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  Volkswagen Tiguan ఫీచర్స్:

  కొత్త టిగువాన్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో వర్చువల్ కాక్‌పిట్, లెదర్ సీట్లు, 30 షేడ్స్ ఆఫ్ యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ గేర్ నాబ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  అంతే కాకుండా మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్-సైడ్ ఎలక్ట్రిక్ సీట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందించబడ్డాయి. వీటితోపాటు ఇందులో కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఇందులో ఇవ్వబడింది. దీని సహాయంతో డ్రైవర్ కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతాడు. దీంతో పాటు జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను కూడా ఇందులో ఇచ్చారు.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  Volkswagen Tiguan సేఫ్టీ ఫీచర్స్:

  ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ కెమెరా మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  Volkswagen Tiguan ఇంజిన్:

  కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది TSI టెక్నాలజీ 2.0 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 7 స్పీడ్ DSG గేర్‌బాక్స్ మరియు 4MOTION టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ భారతీయ మార్కెట్లో రాబోయే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఎట్టకేలకు ఈ కొత్త కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

  భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Tiguan: ధర & వివరాలు

  ఇదిలా ఉండగా కంపెనీ గత మార్చ్ 2020 లో భారత మార్కెట్లో విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ప్రీమియం 7 సీటర్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్లో డిస్‌కంటిన్యూ చేసింది. అయితే, గుడ్‌న్యూస్ ఏంటంటే, డిసెంబర్ 7వ తేదీన ఫోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త టిగువాన్ ఎస్‌యూవీని 5 సీటర్ వెర్షన్ గా పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ వస్తున్న నేపథ్యంలో, కంపెనీ తమ పాత మరియు ఖరీదైన 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ నుండి మార్కెట్ నుండి తొలగించిందని భావిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New volkswagen tiguan launched in india price 31 99 lakh features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X