Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2021 వోల్వో ఎస్60 డెలివరీ డేట్ ఫిక్స్ ; ఎప్పుడో తెలుసా..!
ప్రముఖ వాహన తయారీదారు వోల్వో తన ఎస్ 60 ని ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత బొక్కింగ్స్ కూడా ప్రారంభించింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 45.90 లక్షలు. కొత్త వోల్వో ఎస్ 60 బుకింగ్ చేసుకోవాలనుకునే వినియోగదారులు రూ. 1 లక్ష ముందస్తు చెల్లింపు ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎస్ 60 డెలివరీలు మార్చి 18 నుండి ప్రారంభం కానున్నాయి.

కొత్త వోల్వో ఎస్ 60 ను అనేక ఫీచర్లతో తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం ఒక పెట్రోల్ ఇంజన్ ఎంపికతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ యూనిట్ ఉంది, ఇది 190 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

వోల్వో ఎస్ 60 కంపెనీ యొక్క SPA ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన వాహనం. దీనిపై XC60, XC90 మరియు S90 మోడళ్లు నిర్మించబడ్డాయి. ఇది చార్కోల్ బ్లాక్, మెరూన్ మరియు వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
MOST READ:మాడిఫైడ్ టాటా ఇండికా.. ఇప్పుడు మరింత చిన్నదైపోయింది

వోల్వో ఎస్ 60 మంచి డిజైన్ కలిగి ఉంటుంది, దీని డిజైన్ గమనించినట్లయితే, దీని ముందు భాగంలో విస్తృత గ్రిల్ మరియు మధ్యలో వోల్వో బ్యాడ్జింగ్ ఉన్న చెకర్డ్ గ్రిల్ ఉంది. ఈ కారుకు సిగ్నేచర్ ఫోర్ హామర్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లాంప్స్ మరియు షార్ప్ హెడ్ లైట్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎస్ 90 స్టైల్ సి-షేప్ ఎల్ఇడి టైల్ లైట్స్ వంటివి ఉన్నాయి.

ఈ ఎస్ 60 లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సిస్టమ్, హార్మోన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, క్యాబిన్‌లో స్వచ్ఛమైన గాలి కోసం క్లీన్‌జోన్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు సెన్సెస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా అందించబడ్డాయి.
MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, దీనికి సిటీ సేఫ్టీ డిటెక్షన్ ఇవ్వబడింది, దీని వేగం గంటకు 50 కిమీ కంటే ఎక్కువ ఉంటే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ వంటివి కూడా వున్నాయి.

ప్రస్తుతం కంపెనీ ఎక్స్‌సి 90, ఎక్స్‌సి 60, ఎస్ 90, ఎక్స్‌సి 40 లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ సంస్థ పూర్తి సన్నాహాలతో ఈ ఏడాది భారత మార్కెట్లోకి వస్తోంది మరియు మొత్తం 3 కొత్త మోడళ్లను విడుదల చేయబోతోంది, ఇటీవల గురించి కంపెనీ ప్రకటించింది.
MOST READ:లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

కొత్త వోల్వో ఎస్ 60 భారత మార్కెట్లో ఆడి ఎ 4, బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఇ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.