నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

మారుతి సుజుకి ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ బ్యాచ్‌బ్యాక్ కారులో, కంపెనీ ఇప్పుడు ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ మరియు సరికొత్త హైబ్రిడ్ ఇంజన్‌తో ఇది మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

తాజా మీడియా నివేదికల ప్రకారం, ఐదవ తరం సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ జూలై 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కొత్తగా అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది.

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అల్ట్రా అండ్ అడ్వాన్స్‌డ్ హై స్ట్రెంగ్త్ స్టీల్స్‌తో రూపొందించబడిందని మరియు ఇది ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న హియర్‌టెక్ట్ ఆర్కిటెక్చర్ యొక్క అధునాతన వెర్షన్ కావచ్చని సమాచారం. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారైన స్విఫ్ట్ ఇదివరకటి కన్నా చాలా తేలికగా ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సరికొత్త 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో శక్తివంతమైన 1.2 ఎల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను సపోర్టే చేయనుంది. ఇందులో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ లేదా 12 వోల్ట్ ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

భారత మార్కెట్లలో విడుదలయ్యే కొత్త తరం స్విఫ్ట్ కారులో 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్‌ను మరియు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే స్విఫ్ట్ కారులో 12 వోల్ట్ ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

సుజుకి ఇప్పటికే ఈ 12 వోల్ట్ ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను రాబోయే మారుతి సుజుకి మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు బాలెనో ఆధారిత క్రాస్ఓవర్‌లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 1.4 ఎల్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

భారతదేశంలో, కొత్త 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2 ఎల్ డ్యూయల్‌జెట్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని సమచారం. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మరికొద్ది నెలల్లోనే విడుదల కానున్న స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఈ డ్యూయల్‌జెట్ ఇంజన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండ

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతానికి, కొత్త 2022 మారుతి సుజుకి స్విఫ్ట్‌కి సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ హ్యాచ్‌బ్యాక్ లోపల మరియు వెలుపల కీలకమైన మార్పులను మనం ఆశించవచ్చు. అయితే, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉండే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్స్, హెడ్‌లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ మరియు ఫాగ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండొచ్చని అంచనా. అలాగే, దీని వెనుక డిజైన్ మరియు అల్లాయ్ వీల్స్‌లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందియ అయితే, దీని వాస్తవ కొలతల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా, ఈ కారులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, రియర్ సీట్ ప్యాసింజర్ కోసం ఏసి వెంట్స్, అధునాతన క్యాబిన్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఆశించవచ్చు.

Most Read Articles

English summary
According to reports, Suzuki is working on next-gen Swift, India launch expected next year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X