సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

నిస్సాన్ ఇండియా గడచిన డిసెంబర్ 2020 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్న విషయం తెలిసినదే. అయితే, ఈ పరీక్షకు ఉపయోగించిన మాగ్నైట్ కారును థాయ్‌ల్యాండ్‌లో తయారు చేసినట్లు సమాచారం.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

మరి భారతదేశంలో తయారైన నిస్సాన్ మాగ్నైట్‌కు ఇదే రకమైన సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుందా? అని ట్విట్టర్ వేదికగా ఓ నిస్సాన్ అభిమాని లేవనెత్తిన ప్రశ్నకు నిస్సాన్ ఇండియా సమాధానం ఇచ్చింది. భారతదేశంలో తయారు చేయబడి మరియు విక్రయించబడుతున్న నిస్సాన్ మాగ్నైట్ కూడా ఏషియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిందని నిస్సాన్ ఇండియా ధృవీకరించింది.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

నిస్సాన్ తమ కస్టమర్లు మరియు వారి కుటుంబాల భద్రత విషయంలో కట్టుబడి ఉంటుందని పేర్కొంది. గతంలో ఏషియన్ ఎన్‌క్యాప్ విడుదల నివేదికలో మొత్తం స్కోరు ఆధారంగా, కొత్త నిస్సాన్ మాగ్నైట్ అసెస్‌మెంట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందినట్లు తెలెపింది.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

ఏషియన్ ఎన్‌క్యాప్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఈ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఎఓపి) కోసం 39.02 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి) కోసం 16.32 పాయింట్లు సాధించింది. సేఫ్టీ అసిస్ట్ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్ 15.28 పాయింట్లు సాధించి, మొత్తంగా 70.60 పాయింట్ల స్కోరును దక్కించుకుంది. దీంతో ఈ క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

ఈ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఫ్రంటల్ మరియు సైడ్ ఇంపాక్ట్ పరీక్షలను నిర్వహించారు. ఈ క్రాష్ టెస్టుల్లో ఉపయోగించిన డమ్మీల (మనుషుల స్థానంలో ఉపయోగించే బొమ్మల) నుండి సేకరించిన డేటా ప్రకారం, డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఇద్దరి తల మరియు కాళ్లకి తగిన రక్షణ లభించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడి )ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇఎస్‌సి (ఇంజన్ స్టెబిలిటీ కంట్రోల్), సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

ఇకపోతే, రెండవ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అయిన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

ఈ కారులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీలో మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌కు కూడా 4-స్టార్ రేటింగ్!

అలాగే, ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 23, 2021, 11:09 [IST]
English summary
Nissan Confirms Made In India Magnite Also Has 4 Star Safety Rating. Read In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+