2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల నిస్సాన్ కంపెనీ తన బ్రాండ్ నుంచి కొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఆత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు భారీగా పెరుగుదల దశగా ముందుకు వెళ్తున్నాయి.

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

ఫిబ్రవరి నెల ముగియడంతో దాదాపు అన్ని కంపెనీల యొక్క 2021 ఫిబ్రవరి అమ్మకాల నివేదికలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో భాగంగా నిస్సాన్ కంపెనీ కూడా తన 2021 ఫిబ్రవరి అమ్మకాల నివేదికను విడుదల చేసింది.

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

నిస్సాన్ కంపెనీ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, గత నెలలో మొత్తం 4,244 వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే ఫిబ్రవరి నెలలో కంపెనీ 1,028 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మునుపటి ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ అమ్మకాలు దాదాపుగా పెరిగాయి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

మరోవైపు జనవరి 2021 లో కంపెనీ మొత్తం 4,021 యూనిట్ల వాహనాలను విక్రయించగా, ఫిబ్రవరి నెలలో కంపెనీ అమ్మకాలు 5.55 శాతం పెరిగాయి. నిస్సాన్ ఇండియా అమ్మకాలకు అతిపెద్ద సహకారం కొత్త నిస్సాన్ మాగ్నైట్. సంస్థ యొక్క ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 40,000 యూనిట్లకు పైగా బుక్ చేయబడ్డాయి.

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

ఇది మాత్రమే కాకుండా గత రెండు నెలల్లో కంపెనీ ఈ మాగ్నైట్ ఎస్‌యూవీని 6,582 యూనిట్ల వరకు విక్రయించింది. ఈ మాగ్నైట్ ఎస్‌యూవీ ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) అనే వేరియంట్లలో ప్రవేశపెట్టారు.

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

కొత్త మాగ్నైట్ ఎస్‌యూవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, దాని బేస్ వేరియంట్లో 16 ఇంచెస్ వీల్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్స్, ఎల్‌సిడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అల్ పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలిగి ఉంటుంది.

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

నిస్సాన్ మాగ్నైట్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటాయి. మాగ్నైట్ యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు గరిష్ట టార్క్ 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ అందించబడ్డాయి.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ కూడా సేఫ్టీ కార్ విభాగంలో స్థానం సంపాదించుకుంది. ఇటీవలి జరిగిన క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల కూడా దీని బుకింగ్స్ బాగా పెరుగుతున్నాయి.

2021 ఫిబ్రవరిలో పెరిగిన నిస్సాన్ సేల్స్.. సేల్స్ పెరగటానికి కారణం ఇదే

నిస్సాన్ మాగ్నైట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి లభిస్తాయి. ఏది ఏమైనా నిస్సాన్ యొక్క అమ్మకాలకు మాగ్నైట్ బాగా దోహదపడిందని చెప్పాలి.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Nissan India Sales February 2021. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X