2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) ఎట్టకేలకు 2021 అక్టోబర్ నెల అమ్మకాల నివేదికను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ నివేదికల ప్రకారం, కంపెనీ దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ప్రారంభించడం వల్ల అమ్మకాలు కొంత వరకు పెరుగుదల దిశ వైపు పయనించినట్లు తెలుస్తుంది.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

Nissan India (నిస్సాన్ ఇండియా) 2021 అక్టోబర్ నెలలో నిస్సాన్ మరియు డాట్సన్‌లకు 3,913 కార్ల దేశీయ హోల్‌సేల్ అమ్మకాలను మరియు 3,004 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసిందని కంపెనీ తెలియజేసింది. అక్టోబర్ 2020లో, కంపెనీ దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 1,105 కార్లు మరియు 75 కార్లు ఎగుమతి చేయబడ్డాయి.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఇండియా 254% వృద్ధిని సాధించింది. నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్ గురించి మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ అధికారిక సమాచారం అందించారు. అంతే కాకుండా, మొదటి ఏడు నెలల అమ్మకాలు మునుపటి పూర్తి ఆర్థిక సంవత్సరం యొక్క అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయి.

కానీ దేశంలో అధికంగా వ్యాపించిన కరోనా మహమ్మారి వల్ల కంపెనీ కొంత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది, దీనికి తోడు సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ఇది విక్రయాలపైన కూడా ప్రభావం చూపింది, అయితే ఇప్పుడు పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని తెలిపారు.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

అంతే కాకుండా, పాజిటివ్ మొమెంటంను కొనసాగిస్తూ, బిగ్ బోల్డ్ మరియు నిస్సాన్ మాగ్నైట్ మరియు నిస్సాన్ కిక్స్ యొక్క బలమైన పనితీరుపై భాగస్వాములు అత్యధిక నెలవారీ రిటైల్ విక్రయాలను అందించడంతో ఈ పండుగ సీజన్ చాలా బాగుందని కూడా అయన ప్రస్తావించారు. మొత్తానికి కంపెనీ యొక్క అమ్మకాలకు పండుగ సీజన్ కొంతవరకు దోహదపడింది.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

Nissan Magnite (నిస్సాన్ మాగ్నైట్) దేశీయ మార్కెట్లో మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని దీని యొక్క ఉత్పత్తి మరింత వేగవంతం చేయడానికి కంపెనీ తగిన సన్నాహాలను సిద్ధం చేసుకుంటోంది. నిస్సాన్ కంపెనీ యొక్క నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి చాలా సహాయపడింది.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) యొక్క కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయబోతున్నట్లు కొంతకాలం క్రితం సమాచారం విడుదలైంది. ఇది ఈ కారు యొక్క XV ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌గా ఉండబోతోంది. ఈ వేరియంట్ XL మరియు XV వేరియంట్‌ల మధ్య ఉంచబడుతుంది. దీని ధర సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ధర ఎక్కువైనప్పటికీ కొనుగోలుదారులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతారు.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ యొక్క కొత్త వేరియంట్‌లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డోర్‌లపై సిల్వర్ క్లాడింగ్, కప్‌హోల్డర్‌లతో రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ సీట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్ మరియు ఐసోఫిక్స్ మౌంట్ వంటివి ఉంటాయి.

అంతే కాకుండా ఈ Magnite XV ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఆండ్రాయిడ్ ఆటో, ఇన్-బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ మిర్రర్ లింక్ మరియు వీడియో ప్లేతో కూడిన 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. పార్కింగ్‌ను మరింత సులభతరం చేయడానికి, ఈ కారు రియర్ పార్కింగ్ కెమెరాను కూడా పొందుతుంది. ఈ ఫీచర్స్ కాకుండా XL వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

2021 అక్టోబర్ Nissan సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

Magnite యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో Nissan సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి.

Most Read Articles

English summary
Nissan india whole sales october 6917 units details
Story first published: Tuesday, November 2, 2021, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X