కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఇటీవలి కాలంలో అనేక కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. ఇందులో ప్రధానంగా నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్‌లు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి. నిస్సాన్, రెనో బ్రాండ్ల నుండి వచ్చిన ఈ మోడళ్లు వాటి సరసమైన ధర కారణంగా మార్కెట్లో మంచి ప్రజాదరణను పొందుతున్నాయి.

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటమే కాకుండా, వీటిలో అందించబడుతున్న ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలుగా ఉంటే, రెనో కైగర్ ప్రారంభ ధర రూ.5.45 లక్షలుగా ఉంది.

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

మరి ఈ రెండు బేస్ వేరియంట్లలో లభించే ఫీచర్లు, వాటి వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

డిజైన్

సాధారణంగా తక్కువ ధర కారణంగా, బేస్ వేరియంట్లు అనేక ఫీచర్లను కోల్పోతూ ఉంటాయి. నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ ఎక్స్ఈలో టర్న్ ఇండికేటర్లు లేని ప్లెయిన్ బ్లాక్ సైడ్ మిర్రర్స్, హబ్ క్యాప్‌తో కూడిన 16 ఇంచ్ స్టీల్ వీల్స్ ఉంటాయి. ఇందులో కలర్ సైడ్ మిర్రర్స్, మ్యూజిక్ సిస్టమ్స్, వీల్ క్యాప్స్, ఫ్రంట్ మరియు రియర్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉండవు.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

ఇక రెనో కైగర్ బేస్ వేరియంట్ ఆర్ఎక్స్ఈ విషయానికి వస్త, ఇందులో ఎల్ఈడి డిఆర్ఎల్, C- ఆకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో 16 ఇంచ్ స్టీల్ వీల్స్, వీల్ కవర్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్, మిస్టరీ బ్లాక్ సైడ్ మిర్రర్స్ మొదలైనవి లభిస్తాయి. ఈ విషయంలో మాగ్నైట్ కంటే కైగర్ బెస్ట్‌గా ఉంటుంది.

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

ఫీచర్లు

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ క్యాబిన్ లేత బూడిద రంగులో ఉంటుంది. ఇందులో స్పోర్టీ ఏసి వెంట్స్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ నాబ్‌పై క్రోమ్ యాక్సెంట్, స్టీరింగ్ వీల్‌పై సిల్వర్ యాక్సెంట్, రియర్ వైపర్, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్, మాన్యువల్ ఏసి (హీటర్‌తో), వెనుక భాగంలో పూర్తిగా మడత పెట్టగల సీట్స్ ఉంటాయి. అయితే, ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ లేదా మ్యూజిక్ సిస్టమ్ ఉండదు.

MOST READ:చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

అలాగే, రెనో కైగర్‌లోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండదు. ఇందులో 3.5 ఇంచ్ ఎల్‌ఈడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ అండ్ రియర్ సీట్లలో సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్స్, హై సెంటర్ కన్సోల్, ఫ్రంట్ పవర్ విండోస్, ఫ్రంట్ అండ్ రియర్‌లో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, హీటర్‌తో కూడిన మాన్యువల్ ఏసి ఫీచర్లు ఉన్నాయి. ఈ విషయంలో రెండు మోడళ్లు ఒకేలా ఉన్నాయి.

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్‌లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, రియర్ సీట్ బెల్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, యాంటీ రోల్ బార్, రియర్ పార్కింగ్ సెన్సార్, ఇంజన్ మొబిలైజర్, చైల్డ్ లాక్, హెవీ బ్రేకింగ్‌పై ఆటోమేటిక్ అలెర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ విండో డిఫోగర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

కంపారిజన్: నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనో కైగర్; రెండింటిలో ఏది బెస్ట్?

ఇక రెనో కైగర్ సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో కూడా డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్, లోడ్ లిమిటర్, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్‌కు మాత్రమే సీట్‌బెల్ట్ ప్రీ టెన్షనర్ ఉన్నాయి. ఈ విషయంలో నిస్సాన్ మాగ్నైట్ బెస్ట్‌గా చెప్పవచ్చు.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Comparison Between Nissan Magnite And Renault Kiger: Design, Features, Safety. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X