అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

2021 ఆగష్టు నెల ముగిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆటో మొబైల్ కంపెనీలు ఆగష్టు నెల సేల్స్ రిపోర్ట్స్ కూడా విడుదల చేస్తున్నాయి. Nissan (నిస్సాన్) కంపెనీ కూడా ఆగష్టు నెలలో తన Magnite (మ్యాగ్నైట్) అమ్మకాల నివేదికను విడుదల చేసింది. Nissan Magnite అమ్మకాలు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan కంపెనీ యొక్క సబ్-కాంపాక్ట్ SUV అయిన Nissan Magnite 60,000 యూనిట్ల బుకింగ్‌లను పొందింది. Nissan Magnite 2020 డిసెంబర్ 2 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయబడింది. కంపెనీ ఈ కారిణి దేశీయ మార్కెట్లో విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan Magnite అతి తక్కువ కాలంలోనే అత్యధికంగా ఆదరణ పొందటానికి ప్రధాన కారణం, దాని ధర మరియు ఫీచర్స్. Nissan Magnite దాని విభాగంలో Tata Nexon, Ford EcoSport వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan కంపెనీ రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా తన కార్ల డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే దేశంలోని 29 రాష్ట్రాలలో 1500 కి పైగా నగరాల్లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది, దేశవ్యాప్తంగా అమ్మకాల తర్వాత సర్వీస్ నెట్‌వర్క్‌ను మెరుగుపరిచింది.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan Magnite విపరీతమైన డిమాండ్ ఉన్నందున కంపెనీ తన చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది. దేశీయ మార్కెట్లో Nissan Magnite నాలు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan Magnite అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉటుంది. ఇందులో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్, ఎల్సిడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ని పొందుతుంది. ఇవన్నీ కారుని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Magnite యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో Nissan సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా పెరుగుతున్నాయి.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉన్నాయి.

అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యాక్ససరీస్ కూడా వెల్లడించింది. ఇందులో ఎస్సెన్షియల్స్, స్టైలింగ్ మరియు ప్రీమియం ఉన్నాయి, వీటి ధరలు వరుసగా రూ .2,249, రూ .4,799 మరియు రూ .8,999 కొనుగోలు చేయవచ్చు. Nissan Magnite ను కంపెనీ డీలర్‌షిప్‌లు లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇటీవల, కంపెనీ దాని బేస్ వేరియంట్ ధరను పెంచింది. కావున ఈ SUV ప్రారంభ ధర ఇప్పుడు రూ. 5.49 లక్షలు.

 అమాంతం పెరుగుతున్న Nissan Magnite డిమాండ్; 60,000 దాటిన బుకింగ్స్

Nissan Magnite (నిస్సాన్ మ్యాగ్నైట్) మంచ్చి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. నిస్సాన్ కంపెనీ యొక్క ఈ మ్యాగ్నైట్ SUV చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల దేశీయ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

Most Read Articles

English summary
Nissan magnite booking crosses 60000 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X