ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' ధరలను కంపెనీ ఇటీవలే భారీగా పెంచిన సంగతి తెలిసినదే. వేరియంట్‌ను బట్టి నిస్సాన్ మాగ్నైట్ ధరలు రూ.33,000 వరకూ పెరిగాయి. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి (డిసెంబర్ 2020) ఇప్పటి వరకూ దీని ధరలు మూడు సార్లు పెరిగాయి.

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

నిస్సాన్ మాగ్నైట్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, మార్కెట్లో ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. డిసెంబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదలైన ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని, అప్పటి నుండి ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా డెలివరీ చేశామని కంపెనీ ప్రకటించింది.

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

ఈ మొత్తం బుకింగ్స్‌లో డీలర్‌షిప్‌ల నుండి 45,000 యూనిట్లు మరియు ఆన్‌లైన్ ద్వారా 5,000 యూనిట్ల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 60 శాతం బుకింగ్స్ టాప్-ఎండ్ వేరియంట్లయిన ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం లకే వచ్చాయని, ఈ మోడళ్లలో 10 శాతం కస్టమర్లు సివిటి గేర్‌బాక్స్‌కు ప్రాధాన్యతనిచ్చారని కంపెనీ తెలిపింది.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

నిస్సాన్ మాగ్నైట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉంటోంది. అధిక డిమాండ్‌ను తీర్చడం కోసం నిస్సాన్ ఇండియా తమ చెన్నై ప్లాంట్‌లో మాగ్నైట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచింది. ఇందుకోసం కంపెనీ అదనంగా మూడవ షిఫ్టును ప్రారంభించి, 1,000 మందిని కొత్తగా నియమించుకుంది.

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

కొత్తగా నిస్సాన్ మాగ్నైట్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ డీలర్‌షిప్‌లో కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ .5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. విడుదల సమయంలో (డిసెంబర్ 2020లో) ఈ మోడల్‌లోని బేస్ వేరియంట్‌ను కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విక్రయించారు.

MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేయడం లేదు.

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ సరసమైన ధరకే విక్రయిస్తున్నప్పటికీ, ఇందులోని ఫీచర్ల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఆల్ పవర్ విండోస్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు మరియు ఫాగ్‌లాంప్స్ వంటి ఫీచర్లను నిస్సాన్ అందిస్తోంది.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మాగ్నైట్‌లోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

అలాగే, ఈ కారులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు, ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న కారు ఏషియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అద్భుతమైన ఫలితాలను కనబరచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ ఫలితాల ప్రకారం, క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఎఓపి) కోసం 39.02 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి) కోసం 16.32 పాయింట్లు సాధించింది. అలాగే, సేఫ్టీ అసిస్ట్ విభాగంలో 15.28 పాయింట్లు సాధించి, మొత్తంగా 70.60 పాయింట్ల స్కోరుతో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Most Read Articles

English summary
Nissan Magnite Bookings Crossed 50,000 Units Mark, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X