Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

భారతీయ మార్కెట్లో నిస్సాన్ (Nissan) కంపెనీ తన మాగ్నైట్ (Magnite) కాంపాక్ట్ SUV ని విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రతి నెల కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి ఈ SUV చాలా వరకు దోహదపడుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు కంపెనీ 30,000 యూనిట్ల మాగ్నైట్ (Magnite) SUV డెలివరీ మార్కును చేరుకుంది. ఇది నిజంగా కంపెనీ సాధించిన విజయం అనే చెప్పాలి.

గుర్గావ్‌లోని డీలర్‌షిప్‌లో జరిగిన కార్యక్రమంలో 30,000 వ నిస్సాన్ మాగ్నైట్ SUV ని కస్టమర్‌కు అందించారు. దీనికిసంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ సందర్భంలో నిస్సాన్ ఇండియా బృందానికి నిస్సాన్ ఇండియా చైర్‌పర్సన్ 'నిస్సాన్ గ్లోబల్ ప్రెసిడెంట్స్ అవార్డు'ను కూడా అందించారు.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ దేశీయ విఫణిలో 2020 డిసెంబర్ 02 న అధికారికంగా విడుదలైంది. ఈ SUV ఇప్పటివరకు దాదాపు 72,000 యూనిట్ల బుకింగ్స్ పొందింది. కంపెనీ అతి తక్కువ కాలంలో ఇంత ఎక్కువ బుకింగ్స్ పొందటానికి ప్రధాన కారణం ఈ SUV యొక్క డిజైన్ మరియు ఇందులోని ఆధునిక ఫీచర్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంలో విజయం సాధించాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

దేశీయ మార్కెట్లో Nissan Magnite నాలు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్. ఇవన్నీ కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

ఈ కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క డిజైన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్ పియానో-బ్లాక్‌లో పూర్తయింది మరియు దాని చుట్టూ క్రోమ్ ఉంది. గ్రిల్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ల యూనిట్లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‌లో ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, మధ్యలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు ఇరువైపులా ఫాగ్ లాంప్స్ ఉన్నాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

సైడ్ ప్రొఫైల్ స్టైలిష్ డిజైన్‌తో ముందుకు వెళ్తుంది. ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో ORVM లు, కఠినమైన ఎస్‌యూవీ అప్పీల్ మరియు సిల్వర్ రూఫ్ రైల్స్ ఇవ్వడానికి దిగువన బ్లాక్-క్లాడింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వెనుక బంపర్‌పై సిల్వర్ యాక్సెంట్స్ మరియు బూట్-లిడ్ మధ్యలో ఉన్న ‘మాగ్నైట్' బ్యాడ్జింగ్‌తో వెనుక ప్రొఫైల్ కూడా షార్ప్ గా కనిపిస్తుంది.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ లోపల స్పోర్టి ఇంకా ప్రీమియం అనుభూతితో వస్తుంది. క్యాబిన్ డాష్బోర్డ్ మరియు సీట్ అప్హోల్స్టరీతో సహా చుట్టూ బ్లాక్ కలర్ లో పూర్తవుతుంది. డాష్‌బోర్డ్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, ఎలక్ట్రికల్లీ-అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ORVM లు, 12V సాకెట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ చేసే USB పోర్ట్, యాంబియంట్ లైటింగ్, JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

Magnite యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో Nissan సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా పెరుగుతున్నాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉన్నాయి.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

Nissan కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం యాక్ససరీస్ కూడా వెల్లడించింది. ఇందులో ఎస్సెన్షియల్స్, స్టైలింగ్ మరియు ప్రీమియం ఉన్నాయి, వీటి ధరలు వరుసగా రూ .2,249, రూ .4,799 మరియు రూ .8,999 కొనుగోలు చేయవచ్చు. ఇటీవల, కంపెనీ దాని బేస్ వేరియంట్ ధరను పెంచింది. కావున ఈ SUV ప్రారంభ ధర ఇప్పుడు రూ. 5.49 లక్షలు.

Magnite డెలివరీలలో కొత్త మైలురాయి చేరుకున్న Nissan: వివరాలు

Nissan Magnite (నిస్సాన్ మ్యాగ్నైట్) మంచ్చి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. నిస్సాన్ కంపెనీ యొక్క ఈ మ్యాగ్నైట్ SUV చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల దేశీయ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

Most Read Articles

English summary
Nissan magnite compact suv achieves 30000 delivery milestone
Story first published: Friday, November 26, 2021, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X