75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ (Nissan) గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ (Nissan Magnite) అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ, దానికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. నిస్సాన్ మాగ్నైట్ కోసం ఇప్పటి వరకూ 75,567 యూనిట్లకు పైగా బుకింగ్స్ రాగా, కంపెనీ వీటిలో ఇప్పటికే 30,000 యూనిట్లకు పైగా డెలివరీ చేసింది.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

నిస్సాన్ మాగ్నైట్ కారణంగా భారతదేశంలో కంపెనీ అమ్మకాలు కూడా పెరిగాయి. అంతేకాదు, దేశంలో నిస్సాన్ ఇండియా మార్కెట్ వాటా కూడా పెరిగింది. ఏప్రిల్-అక్టోబర్ 2021 కాలంలో కంపెనీ వాటా ఏడాది క్రితం 0.37 శాతంగా (4,431 యూనిట్లు) ఉంటే అది ఇప్పుడు 1.38 శాతానికి (22,304 యూనిట్లు) శాతానికి పెరిగింది. నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం దాని స్పోర్టీ డిజైన్ మరియు సరమైన ధర. కేవలం రూ.5.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ చిన్న కారు, ధర మరియు ఫీచర్ల పరంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోనే కాకుండా ఇతర చిన్న కార్ల సెగ్మెంట్లలోని మోడళ్లకు కూడా గట్టి సవాలు విసిరింది.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కాకపోతే, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ మాత్రం అందుబాటులో లేదు. మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే, 1.0 లీట్ న్యాచురల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

నిస్సాన్ నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ ఎస‌యూవీ ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు కోసం ఇటీవల ASEAN NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో, నిస్సాన్ మాగ్నైట్ కు 5 స్టార్లకు గానూ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ సేఫ్టీ రేటింగ్ కూడా నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాల పెరుగుదలకు మరొక కారణంగా చెప్పవచ్చు. ఈ కారును సురక్షితంగా మార్చడంలో దాని బలమైన శరీరం మరియు మెరుగైన భద్రతా ఫీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

సేఫ్టీ ఫీచర్ల జాబితాను పరిశీలిస్తే, ఈ చిన్న కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు స్టాండర్డ్ గా లభిస్తాయి. అదనంగా, ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో కంపెనీ ఇటీవల ఓ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ ను నిలిపివేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం కంపెనీ అందించిన ఓనిక్స్ బ్లాక్‌తో విత్ ఫ్లేర్ గార్నెట్ రెడ్‌ కలర్ ఆప్షన్ ను నిలిపివేసింది. ఈ కలర్ ఆప్షన్ ను కంపెనీ వెబ్‌సైట్ మరియు బ్రోచర్‌ల నుండి తీసివేయడం జరిగింది. ఈ మార్పు తర్వాత నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు ఐదు మోనో-టోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

ఇదిలా ఉంటే, నిస్సాన్ త్వరలోనే మాగ్నైట్ కోసం మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త వేరియంట్ ను XV ఎగ్జిక్యూటివ్ గా పరిచయం చేసే అవకాశం ఉంది మరియు దీనిని XL మరియు XV వేరియంట్‌ల మధ్యలో ఆఫర్ చేయబడుతుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ కొత్త వేరియంట్ ధర ప్రస్తుత XL వేరియంట్ ధర కన్నా సుమారు రూ. 52,000 ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇందులో దాని అధనపు ధరకు తగినట్లుగా అధనపు ఫీచర్లు మరియు పరికరాలు కూడా లభ్యం కానున్నాయి.

75,000 యూనిట్లను దాటిన Nissan Magnite బుకింగ్స్, ఇందులో ఎన్ని డెలివరీ అయ్యాయంటే..?

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, తలుపులపై సిల్వర్ క్లాడింగ్, 60:40 స్ప్లిట్ సీట్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, ముందు సీటుపై బ్యాక్ పాకెట్, పిల్లల భద్రత కోసం ఐసోఫిక్స్ మౌంట్‌ మరియు వెనుక సీటుపై కప్ హోల్డర్లతో కూడిన ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి. నిస్సాన్ మాగ్నైట్‌ను కంపెనీ డీలర్‌షిప్‌లలో కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Nissan magnite compact suv bookings crossed 75567 units since launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X