రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

కొత్తగా నిస్సాన్ మాగ్నైట్ కారును కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. గడచిన డిసెంబర్ 2020లో కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే విడుదలైన ఈ చిన్న కారు ధరలు ఇప్పుడు మరోసారి భారీగా పెరిగాయి. వేరియంట్‌ను బట్టి మాగ్నైట్ ధరలు రూ.33,000 వరకూ పెరిగాయి.

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

ఈ ఏడాది జనవరి 2021లో కంపెనీ కేవలం ప్రారంభ వేరియంట్ ధరను మాత్రమే రూ.50,000 మేర పెంచి రూ.5.49 లక్షలు చేసింది. ఆ తర్వాత గడచిన మార్చి 2021 నెలలో అన్ని టర్బో వేరియంట్ ధరలను సుమారు రూ.30,000 వరకూ పెంచింది. కాగా, ఇప్పుడు మూడోసారి కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

నిస్సాన్ మాగ్నైట్ యొక్క టర్బోయేతర వేరియంట్ల ధరలను కంపెనీ గరిష్టంగా రూ.33,000 వరకు పెంచింది. ఈ వేరియంట్లను గడచిన మార్చి నెల చివరి వరకు పరిచయ ధరలకు (బేస్-వేరియంట్ ఎక్స్ఈ మినహా) విక్రయించారు.

MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

కాగా, టర్బో-పెట్రోల్ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.20,000 వరకు పెంచింది. ఈ కారు విడుదలైనప్పటి ధరలతో పోలిస్తే, ఇప్పటి వరకూ ఈ టర్బో వేరియంట్ల ధరలు రూ.50,000 వరకు పెరిగాయి. అయితే, టర్బో-పెట్రోల్ లైనప్‌లో రేంజ్-టాపింగ్ వేరియంట్ అయిన ఎక్స్‌వి ప్రీమియం (ఓ) ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

నిస్సాన్ ఎక్స్‌వి ప్రీమియం మరియు ఎక్స్‌వి ప్రీమియం (ఓ) వేరియంట్ల మధ్య ప్రాధమిక వ్యత్యాసం ఏమిటంటే, ఈ ఆప్షనల్ వేరియంట్లో నిస్సాన్ యొక్క లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ లభిస్తుంది. గడచిన డిసెంబర్ 2020 నుండి ఇప్పటి వరకూ ఈ మోడల్ ధరలను మూడుసార్లు పెంచారు.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

నిస్సాన్ మాగ్నైట్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. నిస్సాన్ ఇండియా సగటున ప్రతి నెలా 4000 యూనిట్ల మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయిస్తున్నట్లు కంపెనీ ఇటీవల తెలిపింది.

Variant Old Price New Price Difference
1.0-litre petrol XE ₹5.49 Lakh ₹5.59 Lakh +₹10,000
1.0-litre petrol XL ₹5.99 Lakh ₹6.32 Lakh +₹33,000
1.0-litre petrol XV ₹6.68 Lakh ₹6.99 Lakh +₹31,000
1.0-litre petrol XV DT ₹6.82 Lakh ₹7.15 Lakh +₹33,000
1.0-litre petrol XV Premium ₹7.55 Lakh ₹7.68 Lakh +₹13,000
1.0-litre petrol XV Premium DT ₹7.69 Lakh ₹7.84 Lakh +₹15,000
1.0-litre turbo-petrol XL ₹7.29 Lakh ₹7.49 Lakh +₹20,000
1.0-litre turbo-petrol XV ₹7.98 Lakh ₹8.09 Lakh +₹11,000
1.0-litre turbo-petrol XV DT ₹8.12 Lakh ₹8.25 Lakh +₹13,000
1.0-litre turbo-petrol XV Premium ₹8.75 Lakh ₹8.89 Lakh +₹14,000
1.0-litre turbo-petrol XV Premium DT ₹8.89 Lakh ₹9.05 Lakh +₹16,000
1.0-litre turbo-petrol XL CVT ₹8.19 Lakh ₹8.39 Lakh +₹20,000
1.0-litre turbo-petrol XV CVT ₹8.88 Lakh ₹8.99 Lakh +₹11,000
1.0-litre turbo-petrol XV CVT DT ₹9.02 Lakh ₹9.15 Lakh +₹13,000
1.0-litre turbo-petrol XV Premium CVT ₹9.65 Lakh ₹9.74 Lakh +₹9,000
1.0-litre turbo-petrol XV Premium CVT DT ₹9.79 Lakh ₹9.90 Lakh +₹11,000
రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

నిస్సాన్ మాగ్నైట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ చెన్నైలోని తమ ప్లాంట్‌లో కొత్తగా మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది. ఈ మోడల్ ఉత్పత్తి ఇటీవలే 10,000 యూనిట్ల మార్కును కూడా దాటింది.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో అందిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

ఈ కారులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఆల్ పవర్ విండోస్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు మరియు ఫాగ్‌లాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

రూ.33,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు - కొత్త ధరల జాబితా

ఇకపోతే, ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

Most Read Articles

English summary
Nissan Magnite Price Increased Upto Rs 33,000; New List Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X