Just In
- 40 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 51 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 59 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Finance
మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్.. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కార్.. అమ్మకాల్లో అప్పుడే టాప్ 10 లో చేరిపోయింది
భారతదేశంలో కొత్త కాలుష్య నియమాలు అమల్లోకి వచ్చిన తరువాత, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్, కొత్త బిఎస్ 6 ఇంజిన్‌తో నిస్సాన్ కిక్స్ కారును విక్రయిస్తోంది. కానీ ఈ కంపెనీ గత సంవత్సరం తన బ్రాండ్ నుంచి కొత్త నిస్సాన్ మాగ్నెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ కారు, విడుదలైన అతి తక్కువ కాలంలోనే కొత్త చరిత్రను తిరగరాసింది. కొత్త నిస్సాన్ మాగ్నెట్ ఎస్‌యూవీ రికార్డు స్థాయిలో అమ్మకాలను చేపట్టింది. నిస్సాన్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, ఎస్‌యూవీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి 33,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయి.

నిస్సాన్ కొత్త నిస్సాన్ మాగ్నెట్ ఎస్‌యూవీకి చెందిన 4,527 యూనిట్లను కేవలం గత ఒక్క నెలలో విక్రయించింది. టాప్ 10 కార్ల అమ్మకాల జాబితాలో నిస్సాన్ ఇండియా ఇప్పుడు తొమ్మిదో స్థానంలో నిలిచింది. కొత్త నిస్సాన్ మాగ్నెట్ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా ఫోర్డ్, ఎంజి మోటార్, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, ఫియట్ వంటి వాటిని అమ్మకాలలో అధిగమించింది.
MOST READ:భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

2019 డిసెంబర్‌లో నిస్సాన్ ఇండియా 599 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నిస్సాన్ ఇండియా ఈ నెల అమ్మకాలలో భారీ పెరుగుదల నమోదు చేసింది. నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క అమ్మకాల వల్ల మార్కెట్లో కంపెనీ ముందజలో పరుగులు తీయడానికి అనుకూలంగా మారింది.

దేశీయ మార్కెట్లో కొత్త మాగ్నెట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు. మాగ్నైట్ ఎస్‌యూవీ తన విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు హోండా డబ్ల్యుఆర్-వి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:2021 కేంద్ర బడ్జెట్లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ ఇతర ఎస్‌యూవీల ధరలకంటే తక్కువగా ఉంటుంది, అంతే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. కావున ఎక్కువమంది వినియోగదారులు దీనివైపు ఆకర్శించబడుతున్నారు. నిస్సాన్ ఇండియా తన కొత్త సిఎంఎఫ్-ఎ ప్లస్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఎస్‌యూవీని నిర్మించింది.

నిస్సాన్ భాగస్వామి సంస్థ రెనాల్ట్ ఇండియా త్వరలో తన కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ప్లాట్‌ఫాంపై విడుదల చేయడానికి సంకల్పించడం గమనార్హం. ఇండియన్ మార్కెట్లో కొత్త రెనాల్ట్ కిగర్ ప్రారంభించిన తర్వాత కూడా నిస్సాన్ మాగ్నెట్ అమ్మకాల మాదిరిగా కొనసాగుతుందో, లేదో అనేది తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాలి.
MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి

నిస్సాన్ ఇండియా అనేక ఫీచర్లు మరియు పరికరాలతో తన కొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతుంది. అవి 1.0-లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ కలిగి ఉంది.