మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా, భారతదేశంలో కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఇప్పటికే బెంగళూరులో తమ సంస్థ పేరును కూడా రిజిస్టర్ చేసుకుంది.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

కాగా, భారతదశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆ సంస్థను కోరారు. దేశంలో పారిశ్రామిక సమూహాలను నిర్మించడానికి టెస్లాకు కావల్సిన అన్ని రకాల మద్ధతును ప్రభుత్వం అందిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

రైసినా డైలాగ్ 2021 కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ మీడియా మిత్రులకు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ బ్యాటరీ తయారీ, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ వంటి వివిధ అంశాల యొక్క పురోగతికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

MOST READ:మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

టెస్లా సంస్థ గురించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తాను టెస్లా మేనేజ్‌మెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నానని, భారతదేశంలో కార్ల తయారీని ప్రారంభించడానికి ఇది వారికి ఒక సువర్ణావకాశమని టెస్లా అధికారులకు సూచించినట్లు చెప్పారు. టెస్లా ఇప్పటికే భారతీయ తయారీదారుల నుండి అనేక విడిభాగాలను కొనుగోలు చేస్తోంది, కాబట్టి వారికి ఇక్కడ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

టెస్లా సంస్థ భారతదేశంలో తమ స్వంత ఉత్పాదక సదుపాయాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన నితిన్ గడ్కరీ, టెస్లా ఇక్కడే స్థానికంగా తమ స్వంత అమ్మకందారులను అభివృద్ధి చేసుకోవచ్చని మరియు భారతదేశంలో తయారు చేసిన వాహనాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చని హామీ ఇచ్చారు.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

టెస్లా తమ ఇండియా కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని గడ్కరీ సూచించారు. లేకపోతే, భారతదేశంలో ఇప్పటికే ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు టెస్లా ప్రమాణాలతో కూడిన కార్లను తయారు చేసే అవకాశం ఉందని అన్నారు.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

మనదేశంలో తయారవుతున్న భారతీయ ఉత్పత్తులు కూడా నానాటికీ మెరుగుపడుతున్నాయని, రానున్న రెండేళ్లలో మన దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు కూడా టెస్లా ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలవని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటి వరకూ భారతదేశంలో తమ కార్ల విడుదల గురించి కానీ లేదా మార్కెట్లో ఏయే మోడళ్లను ప్రవేశపెట్టబోతున్నామనే విషయం గురించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆరంభంలో టెస్లా తమ కార్లను చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

అంతేకాకుండా, ప్రారంభ దశలో భాగంగా టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లను దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై మరియు బెంగుళూరు నగరాల్లో మాత్రమే విక్రయించాలని భావిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప గతంలో ఓ సందర్భంలో టెస్లా సంస్థ తమ రాష్ట్రంలోనే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

ఏషియన్ మార్కెట్ల కోసం టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లను చైనాలో తయారు చేస్తోంది. ఒకవేళ భారతదేశంలో కూడా టెస్లా తమ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తే, టెస్లాకు ఇది చైనా వెలుపల ఆసియా యొక్క రెండవ అతిపెద్ద ఉత్పాదక కేంద్రం అయ్యే అవకాశం ఉంది.

మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ

ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం, టెస్లా భారత్‌లో ముందుగా తమ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టెస్లా నుండి లభిస్తున్న అత్యంత చౌకైన మోడల్ 3 సెడాన్‌ను తొలి దశలో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. మార్కెట్లో దీని ధర సుమారు రూ.55 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Nitin Gadkari Asks Tesla To Start Production In India ASAP. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X