కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్, ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ కొత్త తరం టాటా సఫారీ కోసం కంపెనీ ఇప్పుడు అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లను వెల్లడి చేసింది. టాటా మోటార్స్ ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని ఆరు వేరియంట్లలో విడుదల చేసింది. మార్కెట్లో కొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు రూ.14.69 లక్షల నుంచి రూ.21.45 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

కొత్త టాటా సఫారీలో స్టాండర్డ్ వేరియంట్లతో పాటుగా కంపెనీ కొత్తగా 'అడ్వెంచర్ ఎడిషన్' పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయి.

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

కాగా, ఇందులో స్టాండర్డ్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ రెండు మోడళ్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజ్‌లను అందిస్తోంది. వాటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ఎక్స్టీరియర్ యాక్ససరీలు

టాటా సఫారీ ఎక్స్టీరియర్ యాక్ససరీస్‌లో భాగంగా, 75 కిలోల వరకు లోడ్ మోసే సామర్థ్యం కలిగిన ఫంక్షనల్ రూఫ్ రాక్స్ (సన్‌రూఫ్ లేని వేరియంట్లలో మాత్రమే), బోనెట్‌పై 'సఫారి' లోగో, ఫాక్స్ క్రోమ్ ఎగ్జాస్ట్ మరియు క్రోమ్ విండో ఫ్రేమ్ కిట్, సైకిల్ మౌంట్ మరియు డోర్ వైజర్‌లను కంపెనీ అందిస్తోంది.

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ఇవే కాకుండా, అండర్ బాడీ లైట్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, సైడ్ స్టెప్స్, మడ్ ఫ్లాప్స్, రియర్ బంపర్ మరియు టెయిల్ గేట్‌పై క్రోమ్ గార్నిష్ యాక్ససరీలను కూడా కంపెనీ అందిస్తోంది. కొత్త సఫారీ ఇంటీరియర్స్ కోసం కూడా కంపెనీ పలు రకాల యాక్ససరీలను అందిస్తోంది.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ఇంటీరియర్ యాక్ససరీస్

ఇంటీరియర్ యాక్ససరీస్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, స్కఫ్ ప్లేట్లు, పడల్ ల్యాంప్స్, డిస్ప్లేతో కూడిన ఫ్రంట్ కెమెరా, కోట్ హ్యాంగర్, సన్ షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, 3డి ఫ్లోర్ మాట్స్ మరియు వెనుక ప్రయాణీకుల కోసం షోల్డర్ రెస్ట్ మరియు కుషన్‌లను కంపెనీ అందిస్తోంది.

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ఇవే కాకుండా, 3డి బూట్ మాట్స్, యాంటీ స్క్రాచ్ డాష్ మాట్స్, వీల్ స్టెప్స్, బోనెట్ స్కూప్స్, డాష్ క్యామ్, బ్యాక్ సీట్ ఆర్గనైజర్, జెర్రీ క్యాన్ మరియు అత్యవసర టూల్ కిట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ కారు కోసం ఏడు యాక్ససరీ ప్యాకేజీలను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

వీటిలో అకంప్లిష్, అకంప్లిష్ ప్రో, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్రో, డిజైన్, సేఫ్టీ మరియు కంఫర్ట్ ప్యాకేజ్‌లు ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే ప్యాకేజ్‌ను బట్టి, అందులోని యాక్ససరీలు లభిస్తాయి.

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

ఇక సరికొత్త 2021 టాటా సఫారీ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారును కంపెనీ యొక్క ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించారు. దీని ముందు భాగంలో 'Y' ఆకారపు గ్రిల్, సన్నని ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడి హెడ్‌లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి.

MOST READ:2030 నాటికి 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్న ఫ్లిప్‌కార్ట్

కొత్త సఫారీ కోసం టాటా నుండి అఫీషియల్ యాక్ససరీస్ ప్యాకేజ్‌లు

టాటా సఫారీ కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Official Accessories Package Details For New 2021 Tata Safari. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X