కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఫస్ట్ వెర్షన్ మహీంద్రా బొలెరో దేశీయ మార్కెట్లో లాంచ్ అయి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా బొలెరో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది.

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

సాధారణంగా చాలామంది వాహన ప్రేమికులు వారికి ఇష్టమైన వాహనాలను వారికి నచ్చినట్టు మాడిఫై చేసుకుంటారు. మాడిఫైడ్ వాహనాల గురించి మనం ఇదివరకటి కథనాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఇటీవల ఒక మాడిఫైడ్ మహీంద్రా బొలెరో బయటపడింది.

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

సాధారణంగా బొలెరో ఎస్‌యూవీ ఎక్కువగా ఆఫ్-రోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. బొలెరో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇక్కడ మాడిఫై చేయబడిన ఈ బొలెరో మరింత విలాసవంతంగా కనిపిస్తుంది. మాడిఫైడ్ చేయబడిన ఈ ఎస్‌యూవీ తయారు చేసిన సంస్థ దీనికి 'జురా' అని పేరు పెట్టింది. జురా అనేది ఒక పర్వత శ్రేణి, ఇది ఈ పర్వత శ్రేణి పశ్చిమ ఆల్ప్స్ యొక్క ఉత్తరాన ఉంది.

MOST READ:డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

ఈ మాడిఫై మహీంద్రా బొలెరో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, చాలా మార్పులు పొందింది. ఈ మహీంద్రా బొలెరో యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ బాగా మాడిఫై చేయబడింది. కావున చూసిన వెంటనే ఇది ఖచ్చితంగా మహీంద్రా బొలెరో అని గుర్తించడం చాలా కష్టం.

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

జురా అని పిలవబడే ఈ ఫస్ట్ వెర్షన్ మహీంద్రా బొలెరో దాని అసలైన రూపానికి చాలా వరకు భిన్నంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని రోజోటెక్‌కు చెందిన రోహన్ జార్జ్ రూపొందించినట్లు తెలిసింది. ఈ ఎస్‌యూవీ డ్యూయల్ టోన్ కలర్ లో ఉంది. సాధారణంగా ఈ ఎస్‌యూవీ యొక్క బేస్ కలర్ రెడ్ మరియు బ్లాక్ కలర్ లో ఉంటుంది.

MOST READ:ACP అని చెప్పుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

ఈ మాడిఫైడ్ కారులో రూఫ్, స్పేర్ వీల్ రియర్ కవర్, డోర్ హ్యాండిల్, ఎక్స్‌టర్నల్ రియర్ వ్యూ మిర్రర్ మరియు ఫ్రంట్ బోనెట్ వంటివి బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ ఎస్‌యూవీ యొక్క వెనుక భాగం ముందు కంటే చాలా భిన్నంగా మరియు చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ముందు భాగంలో హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు అమర్చారు.

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

ఎస్‌యూవీలో వెనుక బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ బోనెట్, బోనెట్‌పై పెద్ద స్కూప్, ఫాగ్ లాంప్ హౌసింగ్‌పై టర్న్ ఇండికేటర్ స్ట్రిప్స్‌తో కూడిన ప్రత్యేక బంపర్ మరియు బ్రాంజ్ ఫినిష్ ఫాక్స్ స్కిడ్‌ప్లేట్ అమర్చారు. ఇక సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇందులో వీల్ ఆర్క్ మరియు వైడ్ టైర్లతో స్టీల్ ఆర్క్ ఉంటుంది. సులభంగా ఎక్కడానికి మరియు ల్యాండింగ్ చేయడానికి సైడ్ స్టెప్స్ కూడా ఇందులో అందించబడతాయి.

MOST READ:అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

ఈ మాడిఫైడ్ ఎస్‌యూవీలో ఎక్స్-టీరియర్ రియర్ వ్యూ మిర్రర్ మునుపటికంటే 2 ఇంచెస్ పెద్దదిగా ఉంటుంది. వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌ను ఫాక్స్ స్కిడ్ ప్లేట్, స్పేర్ వీల్, రివైజ్డ్ రియర్ బంపర్ విత్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్‌తో అమర్చారు. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్‌ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Image Courtesy: Rohan George/ROGEOTECH Via Facebook

Most Read Articles

English summary
Old Mahindra Bolero Modified Like A Luxury SUV. Read in Telugu.
Story first published: Monday, May 31, 2021, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X