Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) భారతదేశంలో తమ ప్లాంట్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఈ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఫోర్డ్ ఇండియాకు తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. కంపెనీ తీసుకున్న ఈ అకస్మాత్ నిర్ణయం కారణంగా, ఈ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడనున్నారు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు గానూ ఓ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ముందుకొచ్చింది. భారతదేశ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాఫ్ట్ మోటార్స్ (Raft Motors), ఫోర్డ్ ఉద్యోగులు మరియు డీలర్లకు తమ కంపెనీలో అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఆసక్తి ఉన్న ఫోర్డ్ ఉద్యోగులు, దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్ ను విస్తరించాలనే రాఫ్ట్ మోటార్స్ లక్ష్యంలో భాగం కావచ్చని తెలిపింది. ఈ మేరకు రాఫ్ట్ మోటార్స్, ఫోర్డ్ ఉద్యోగులు మరియు డీలర్ల నుండి ధరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం, ఈ సంస్థ (Raft Motor) దేశంలోని 17 రాష్ట్రాల్లో 550 కి పైగా డీలర్‌షిప్ లను నిర్వహిస్తోంది.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

రాఫ్ట్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీపై గరిష్టంగా లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తున్న మొదటి కంపెనీ. రాఫ్ట్ మోటార్స్ తయారు చేసిన కొన్ని ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్లలో వారియర్, సోల్జర్, నుబ్రా, జిస్పా, జిస్పా ఎన్ఎక్స్, ఇండస్, టీస్టా, న్యుబ్రా ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఇంద్రజీత్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 77,500 నుండి రూ. 95,000 మధ్యలో ఉన్నాయి.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

రాఫ్ట్ మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోకి వస్తున్నాయి. ప్రత్యేకించి యువ కస్టమర్ల నుండి వీటి ఆదరణ బాగా ఉంటోంది. నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో రాఫ్ట్ మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా, ఈ కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి పెంచడంతో పాటుగా, రూ. 5,000 లోపు ఇన్‌స్టాల్ చేయగల సరసమైన ఛార్జింగ్ స్టేషన్‌ లపై కూడా రాఫ్ట్ మోటార్స్ పనిచేస్తోంది. రాఫ్ట్ నుండి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా పలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

రాఫ్ట్ యొక్క ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు మరియు హై-ఫై కారావోకే సిస్టమ్స్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు కంపెనీ చాలా తక్కువ ఫీజులతో శిక్షణను కూడా అందిస్తుంది, తద్వారా వారు తామే స్వయంగా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాఫ్ట్ మోటార్స్ ఓ హైపర్-రేంజ్ ఎలక్ట్రిక్ కారుపై కూడా పనిచేస్తోంది. పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 1600 కిమీల రేంజ్‌ ని అందించగల ఓ ఎలక్ట్రిక్ కారును కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇది 2023 మధ్య నాటికి మార్కెట్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఫోర్డ్ నిర్ణయం వలన 4000 మంది కార్మికులు ప్రభావితమవుతారు

ఫోర్డ్ మోటార్స్ భారతదేశాన్ని విడిచిపెట్టాలని తీసుకున్న నిర్ణయం వలన దాదాపు 5,300 మంది ఉద్యోగులు మరియు కార్మికుల భవిష్యత్తును అనిశ్చితంగా మారింది. ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంట్‌లో దాదాపు 2700 మంది శాశ్వత ఉద్యోగులు మరియు 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అదే సమయంలో, గుజరాత్ లోని సనంద్‌ ప్లాంట్ లో కార్మికుల సంఖ్య సుమారు 2000 మందిగా ఉంది. అలాగే, సనంద్ ఇంజన్ ఎక్స్‌పోర్ట్ ప్లాంట్‌లో మరో 500 మంది పనిచేస్తున్నారు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

వీరికి అదనంగా, మరో 100 మందికి పైగా ఉద్యోగులు కస్టమర్ కేర్ మరియు పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేస్తున్నారు. ఫోర్డ్ ఇండియా నిష్క్రమణ తర్వాత కూడా వీరు భారతదేశంలో కంపెనీ వ్యాపారానికి మద్దతునిస్తూనే ఉంటారు. ఫోర్డ్ ఇండియా ప్రకారం, దాని నిర్ణయం వల్ల దాదాపు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని భావిస్తున్నారు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఉద్యోగుల నష్టాన్ని భర్తీ చేయడానికి కంపెనీ పరిహార ప్యాకేజీని అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంట్‌లో ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ మోడల్ కోసం అంతర్జాతీయ మార్కెట్ల నుండి కంపెనీకి కొన్ని పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఫోర్డ్ భారతదేశం నుండి సుమారు 30,000 యూనిట్ల ఎకోస్పోర్ట్ కార్లను ఎగుమతి చేయాల్సి ఉంది మరియు ఇది ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

Ford India ఉద్యోగులు, డీలర్ల నుండి ధరఖాస్తులు ఆహ్వానించిన Raft Motors

ఫోర్డ్ ఇండియా తమ ఫ్యాక్టరీల షట్‌డౌన్ టైమ్‌లైన్ ని కూడా ప్రకటించింది. సమాచారం ప్రకారం, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్‌ను మరియు 2022 రెండవ త్రైమాసికం నాటికి చెన్నై ప్లాంట్ ను మూసివేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోర్డ్ భారతదేశంలో గడచిన 10 ఏళ్ల కాలంలో సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు తెలిపింది. అందుకే, ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పేర్కొంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Raft motors invites applications form ford india employees and dealers details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X