దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

ముందుగా పాఠకులందరికి 'డ్రైవ్‌స్పార్క్ తెలుగు' తరపున దీపావళి శుభాకాంక్షలు.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా కంపెనీలు పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని తమ బ్రాండ్ వాహనాలపైన అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా (Renault India) దీపావళి సందర్భంగా తమ బ్రాండ్ వాహనాలపైన అదిరిపోయే ఆఫర్స్ అందిస్తుంది.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

ఈ ఆఫర్స్ అన్ని కూడా 2021 నవంబర్ 01 నవంబర్ 04 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం కొత్త రెనాల్ట్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు త్వరపడండి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ మీ సొంతం చేసుకొండి.

కంపెనీ ఏ వేరియంట్ పైన ఎంత డిస్కౌంట్ ఇస్తుంది అనే విషయాలను పూర్తిగా ఈ కింద తెలుసుకుందాం.. రండి.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):

రెనాల్ట్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి ఈ Renault Kwid. ఈ కారు ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతూ ముందుకు సాగుతోంది. అయితే ఈ పండుగ సీజన్లో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ కారుపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

అంతే కాకుండా ఈ కారుపై రూ.65,000 వరకు లాయల్టీ బోనస్ కూడా ఇవ్వబడుతోంది. దీనితో పాటు Renault Kwid నుండి ఎంపిక చేయబడిన కార్లపై కంపెనీ అదనంగా రూ. 10,000 నగదు తగ్గింపుతో పాటుగా 'Buy Now - Pay in 2022' ఆఫర్ కింద రూ. 10,000 తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లోని స్క్రాపేజ్ పాలసీని అందిస్తోంది. ఇవన్నీ ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):

కంపెని తన కొత్త Renault Triber MPV పై ఏకంగా రూ. 60,000 అరకు ఆఫర్స్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ మోడల్‌పై రూ. 75,000 వరకు లాయల్టీ బోనస్ ఇవ్వబడుతోంది. ఇది మాత్రమే కాకుండా 'Buy Now - Pay in 2022' ఆఫర్ కింద రూ. 10,000 తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లోని స్క్రాపేజ్ పాలసీని అందిస్తోంది.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

రెనాల్ట్ కిగర్ (Renault Kiger):

రెనాల్ట్ కంపెనీ తాజాగా దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెనాల్ట్ కిగర్ అతి తక్కువా కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ మోడల్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. పండుగ సీజన్‌లో కంపెనీ ఈ కారుపై రూ. 95,000 లాయల్టీ బోనస్‌ కూడా అందిస్తోంది.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

అంతే కాకుండా కంపెనీ ఈ SUV పై రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ అందిస్తుంది. 'Buy Now - Pay in 2022' అనే ఆఫర్ కూడా ఈ మోడల్ కొనుగోలుపై కొనుగోలుదారులు పొందవచ్చు.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

రెనాల్ట్ డస్టర్ (Renault Duster SUV):

రెనాల్ట్ ఇండియా యొక్క కాంపాక్ట్ SUV అయిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster SUV) విషయానికి, ఈ SUVపై కంపెనీ రూ. 1,30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కాకుండా, ఈ కారుపై రూ. 1,10,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్ కూడా అందిస్తుంది. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇవన్నీ కూడా కంపెనీ తెలిపిన వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

దీపావళి స్పెషల్: మెరిసిపోతున్న Renault ఆఫర్స్.. త్వరపడండి.. కేవలం పరిమిత సమయం మాత్రమే

ఇప్పుడు రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్ కోసం మరొక కొత్త ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. కంపెనీ ఈ కొత్త మోడల్ టీజర్ ను కూడా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ Arkana ఎస్‌యూవీకి చెందినట్లు స్పష్టమవుతోంది. రెనో అర్కానా (Renault Arkana) ఎస్‌యూవీ టీజర్ తో పాటుగా కంపెనీ "మేము సిద్ధంగా ఉన్నాము" (we're ready) అంటూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రెనో ఇండియా ఈ పోస్ట్ లో మూవెంబర్ (#Movember) హ్యాష్‌ట్యాగ్ ని ఉపయోగించింది. దీన్ని బట్టి చూస్తుంటే, రెనో ఇండియా టీజర్ పురుషుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault india festive season offers on kwid duster kiger triber details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X