Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీలు అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా ఉన్నాయి. ఈ విభాగంలో ఇప్పటికే అనేక పాపులర్ మోడళ్లు అందుబాటులో ఉండగా, తాజాగా మరికొన్ని మరికొన్ని మోడళ్లు అందుబాటులోకి రావడంతో సెగ్మెంట్లో పోటీ మరింత పెరిగింది.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

ప్రస్తుతం, ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో కైగర్ (Renault Kiger) సెగ్మెంట్‌లో సరికొత్తగా ప్రవేశించిన వాటిలో ఒకటి. ఈ ఏడాది విడుదలైన అత్యంత చవకైన, సరమైన ఎస్‌యూవీలలో రెనో కైగర్ ఒకటి.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

అయితే, కాంపాక్ట్ ఎస్‌యూవీ రేసులో అమ్మకాల పరంగా రెనో కైగర్ కాస్తంత వెనుకబడి ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రెనో కైగర్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ మోడల్ కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ ను విడుదల చేసింది. ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో రెనో తమ కైగర్ ఎస్‌యూవీ యొక్క డిజైన్, ఫీచర్లను హైలైట్ చేస్తుంది. రెనో కైగర్ ఈ బ్రాండ్ క్విడ్ మరియు ట్రైబర్‌ల నుండి ప్రేరణ పొందిన మోడల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కైగర్‌లోని ఫ్రంట్ గ్రిల్ మనం ట్రైబర్‌లో ఉన్నట్లుగానే ఉంటుంది.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

రెనో కైగర్ డిజైన్ ను గమనిస్తే,ఇందులో ఐస్ క్యూబ్ స్టైల్ ఎల్ఈడి హెడ్‌లైట్స్, క్రోమ్ హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్లాట్ బోనెట్, ఈ కారుకి కూప్ బాడీ టైప్ డిజైన్‌ను ఇవ్వటం కోసం వెనుక వైపు వాలుగా డిజైన్ చేసిన పైకప్పు, బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఈ కారులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు కారు చుట్టూ మందపాటి క్లాడింగ్ ఉంటుంది. వీల్ ఆర్చ్‌ల చుట్టూ కూడా దట్టమైన బ్లాక్ ప్లాస్టింగ్ క్లాడింగ్ కనిపిస్తుంది.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

ఈ లక్షణాలతో ఇది మంచి రగ్గడ్ లుక్ ని కలిగి ఉంటుంది. కారు వెనుక భాగంలో సి-ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, మస్కులర్ లుకింగ్ రియర్ బంపర్, కైగర్ బ్రాండింగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు మరియు ఫోకస్ స్కిడ్ ప్లేట్ తో ఈ కారు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక క్యాబిన్ లోపల లభించే ఫీచర్లను గమనిస్తే ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకు వైర్‌లెస్‌గా సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

ఇంకా ఇందులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ మరియు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రెనో కైగర్ సెంటర్ కన్సోల్‌లోని రోటరీ నాబ్‌ని ఉపయోగించి వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లను ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా, ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో రెనో కైగర్ అత్యంత ఇంధన సామర్థ్యం గల కారు. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన టర్బో పెట్రోల్ వెర్షన్‌ ARAI ధృవీకరించబడిన దానికి ప్రకారం లీటరుకు 20.5 కి.మీ మైలేజీని అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Renault Kiger కోసం కొత్త టెలివిజన్ కమర్షియల్ విడుదల; మీరు చూశారా?

రెనో ఇండియా ఇటీవలే భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, రెనో కైగర్ లో కొత్త వేరియంట్ RXT (O)ని పరిచయం చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని రెనో మరియు నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎమ్ఎఫ్ఏ+ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. రెనో క్విడ్, రెనో ట్రైబర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లు కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్నాయి. భారతదేశంలో తయారు చేసిన కైగర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault kiger new tvc released highlights design and key fueature
Story first published: Sunday, December 19, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X