ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఈ ఏడాది ఫిబ్రవరి 2021 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో కైగర్ ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి రెనో కైగర్ ధరలు పెరుగనున్నాయి. అయితే, ఎంత మేర ధరలు పెంచనున్న కంపెనీ ఏప్రిల్ నెలలో వెల్లడించనుంది.

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

కాగా, రెనో కైగర్‌ను ఇదివరకే బుక్ చేసుకున్న కస్టమర్లకు మరియు కొత్తగా ఏప్రిల్ 1వ తేదీ నుండి బుక్ చేసుకునే కస్టమర్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయి. అయితే, ఇప్పటికే రెనో కైగర్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఏప్రిల్ 1వ తేదీ లోపుగా పూర్తి చెల్లింపు (ఫుల్ పేమెంట్) చేసినట్లయితే, వారికి మాత్రం పాత ధరలకే ఈ మోడల్ లభిస్తుంది.

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

రెనో ఇండియా డీలర్లు ఇప్పటికే తమ కస్టమర్లకు ఈ ధరల పెంపుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. నిస్సాన్ మాగ్నైట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రెనో కైగర్‌ను తయారు చేశారు. నిస్సాన్ కూడా ఇటీవలే తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో టర్బో వేరియంట్ల ధరలను రూ.30,000 వరకూ పెంచిన సంగతి తెలిసినదే. - పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

ఈ నేపథ్యంలో, రెనో ఇండియా కూడా నిస్సాన్ బాటలోనే తమ కైగర్ ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. రెనో కైగర్ ఎస్‌యూవీని రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న ఎస్‌యూవీగా ఉంది.

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం డిమాండ్ అధికంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ సుమారు 10 వారాల వరకూ ఉన్నట్లు సమాచారం. మార్చి 3వ తేదీ నుండి దేశంలో కైగర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే, సెమీ కండక్టర్ల చిప్స్ కొరత కారణంగా కైగర్ ఉత్పత్తి కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. దీనివలన కైగర్ వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

నిస్సాన్-రెనో కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎమ్‌ఎఫ్-ఎ + ప్లాట్‌ఫామ్‌పై రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ మాగ్నైట్‌ను కూడా తయారు చేస్తున్నారు. రెనో కైగర్ రెండు పెట్రోల్ ఆంజన్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో (RXE, RXL, RXT & RXZ) విక్రయిస్తున్నారు.

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

రెనో కైగర్ టాప్ ఎండ్ వేరియంట్ (RXZ)లో ట్రై-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్, సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ మరియు మూడు డ్రైవింగ్ మోడ్స్ (నార్మల్, ఎకో మరియు స్పోర్ట్) వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

కారు లోపల ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

ఇంజన్ పరంగా, రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఏప్రిల్ 1 నుండి పెరగనున్న రెనో కైగర్ ధరలు: పాత, కొత్త బుకింగ్‌లకు వర్తింపు!

ప్రస్తుతం మార్కెట్లో రెనో కైగర్ ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.55 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Renault Kiger Prices Will Go Up From 1st April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X