ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

ప్రపంచం ఎలక్ట్రిక్ యుగం వైపు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ కార్ తయారీ సంస్థ రోల్స్ రాయల్స్ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు అడుగులు వేస్తోంది.

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

నివేదికల ప్రకారం బ్రిటన్ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ యాజమాన్యంలో లగ్జరీ కార్ల సంస్థ రోల్స్ రాయిస్ త్వరలో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఈ కారు చూడటానికి చాలా భిన్నంగా ఉంది.

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

రోల్స్ రాయిస్ నుంచి రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'రోల్స్ రాయిస్ సైలెంట్ షాడో'. దీనికోసం కంపెనీ ఇటీవల ఇంగ్లాండ్‌లోని సైలెంట్ షాడో అనే ఎలక్ట్రిక్ కారు కోసం పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసింది. రోల్స్ రాయిస్ కంపెనీ ఇప్పటికే తన అనేక కార్లలో షాడో పేరును ఉపయోగించింది. రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో ఇందులో ప్రధాన కారు. ఈ లగ్జరీ కారుని త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది.

MOST READ:డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

ఈ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం, జర్మనీలోని మ్యూనిచ్‌లోని సంస్థ యొక్క ఉత్పత్తి అభివృద్ధి కేంద్రంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ యొక్క ఎలక్ట్రిక్ ప్రోటోటైప్‌ను పరీక్షిస్తున్నారు.

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

ఈ కారును సైలెంట్ షాడో పేరుతో తయారు చేస్తున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ మొదటి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ కారు ఇంకా అభివృద్ధిలోనే ఉందని కంపెనీ తెలిపింది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

అయితే ఈ కారు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, సుమారు 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారుతో రోల్స్ రాయిస్ కంపెనీ తన ప్రధాన ప్రత్యర్థి బెంట్లీ ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్‌లతో పోటీ పడటానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

రోల్స్ రాయిస్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విధంగా 2040 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని తెలిపింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ కార్ల ఉత్పత్తిని కంపెనీ పూర్తిగా నిలిపివేస్తామని కూడా ప్రకటించింది. 2011 లో, ఫాంటమ్ కార్ యొక్క కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. 2016 లో, కంపెనీ ఆటో షోలో విజన్ నెక్స్ట్ 100 అనే సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది.

MOST READ:అప్పుడే అమ్ముడుపోయిన 2021 హయాబుసా మొదటి బ్యాచ్.. ఇక సెకండ్ బ్యాచ్ ఎప్పుడంటే

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

సాధారణంగా రోల్స్ రాయిస్ శక్తివంతమైన మరియు వేగవంతమైన ఇంజిన్లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు కంపెనీ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్ల వైపు పయనిస్తోంది. రోల్స్ రాయిస్ కస్టమర్లు ఇకపై ఇంజిన్ శబ్దాన్ని ఆస్వాదించలేరు. రానున్న కాలంలో రోల్స్ రాయిస్ కంపెనీ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానుంది.

Most Read Articles

English summary
Rolls Royce Upcoming Electric Car To Travel Around 500 Kms In a Single Charge. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X