కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

మీరు ఇప్పటికే మీకు ఇష్టమైన నిస్సాన్ (Nissan) కారును బుక్ చేసి ఉండి, ఈ పండుగ సీజన్‌లో డెలివరీ కోసం వేచి చూస్తున్నట్లయితే, మీరు మీ కారు డెలివరీ కోసం మరి మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఇందుకు ప్రధాన కారణం, నిస్సాన్ తమ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించుకోవడమే.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు సెమీకండక్టర్ కొరతను ఎదుర్కుంటున్న సంగతి తెలిసినదే. ఈ ప్రభావం నిస్సాన్ పై కూడా బలంగా ఉంది. ఈ కారణంగా నిస్సాన్ తన ప్రపంచ ఉత్పత్తిని (గ్లోబల్ ప్రొడక్షన్) తగ్గించాలని నిర్ణయించుకుంది, ఇది కంపెనీ కార్లలో మూడవ వంతు ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

నిస్సాన్ మోటార్స్ వచ్చే నెల (నవంబర్‌లో) తమ కార్ల ఉత్పత్తిని 30 శాతం తగ్గించబోతోందని, ఇది కొత్త కారు కోసం వేచి ఉన్న వ్యక్తుల వెయిటింగ్ పీరియడ్‌ ను మరికొన్ని నెలలు పొడిగించవచ్చని కంపెనీ తెలిపింది. నిస్సాన్ ప్రకారం, ఈ సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ నెలలో, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5,83,000 కార్లను ఉత్పత్తి చేస్తుంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

సెమీకండక్టర్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునే వరకు కార్ల ఉత్పత్తిలో ఈ తగ్గింపు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. నిస్సాన్ మోటార్స్ వచ్చే నెలలో ఉత్పత్తి లక్ష్యాన్ని నవంబర్‌లో విడుదల చేస్తుంది. ఉత్పత్తి కోత కారణంగా, భారతదేశంలో నిస్సాన్ దేశీయ ఉత్పత్తి కూడా ప్రభావితం కానుంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

నిస్సాన్ సంస్థకు భారతదేశంలోని తమిళనాడు రాజధాని చెన్నైలో కార్ల తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్ లో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) మరియు నిస్సాన్ కిక్స్ (Nissan Kicks) ఎస్‌యూవీలను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిస్సాన్ చేపట్టిన ఉత్పత్తి కోత (ప్రొడక్షన్ కట్) భారతదేశ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతుంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఈ జపనీస్ కార్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. అయితే, ఈ మోడల్ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా, దాని వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. తాజా నివేదికల ప్రకారం, కొత్తగా నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీని బుక్ చేసుకునే కస్టమర్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు ఎనిమిది నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

ఇదిలా ఉంటే, నిస్సాన్ అనుబంధ సంస్థ అయిన ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో (Renault) కూడా భారతదేశంలో కార్ల ఉత్పత్తిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, రెనో ఇండియా దేశీయ విపణిలో క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ కార్లను విక్రయిస్తోంది. కంపెనీ వీటన్నింటినీ తమిళనాడులో నిస్సాన్ తయారు చేస్తున్న కార్ ప్లాంట్లోనే తయారు చేస్తుంది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

తాజా, నివేదిక ప్రకారం, నిస్సాన్ ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల కార్ల ఉత్పత్తిని కోల్పోనుంది. మరొక జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కూడా ఈ ఏడాది నవంబర్‌ నెలలో గ్లోబల్ ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 15 శాతం తగ్గించింది. మలేషియా మరియు వియత్నాంలలో లాక్డౌన్ కారణంగా టొయోటా తయారీ కర్మాగారాలు మూసివేయబడ్డాయి, ఇది కంపెనీ గ్లోబల్ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

ఇదిలా ఉంటే, నిస్సాన్ ఈ సీజన్‌లో తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్లను బట్టి ఈ మోడల్ ధరలు రూ. 6,000 నుండి రూ. 17,000 మేర పెరిగాయి. ధరల పెంపు అనంతరం మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ కొత్త ధరలు రూ. 5.71 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

నిస్సాన్ కిక్స్ (Nissan Kicks)పై లక్ష రూపాయల ఆఫర్స్..

ఇదిలా ఉంటే, నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ కిక్స్ పై కంపెనీ ఈ పండుగ సీజన్ లో లక్ష రూపాయల వరకూ ప్రత్యేక పండుగ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ప్రయోజనాలలో నగదు తగ్గింపులు, ఎక్సేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

నిస్సాన్ కిక్స్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఒకటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 105 బిహెచ్‌పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ వేరియంట్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పోరేట్ బెనిఫిట్‌లను పొందవచ్చు.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

అలాగే, నిస్సాన్ కిక్స్ యొక్క 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 70,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్లను పొందవచ్చు.

కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న Nissan.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..

ఈ ఆఫర్లకు అదనంగా, ఈ రెండు వెర్షన్‌లకు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రూ. 5,000 ప్రత్యేక ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ మరియు 7.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటు ఆఫర్ లభిస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, NIC ఎనేబుల్డ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు లభిస్తాయి మరియు ఈ ఆఫర్లు కస్టమర్ ఉండే ప్రాంతం మరియు డీలర్‌షిప్ ను బట్టి మారుతూ ఉంటాయి.

Most Read Articles

English summary
Semiconductor crisis nissan plans to cut car production waiting period may increase
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X