ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. దేశంలో నిరంతరాయం పెరిగిపోతున్న ఇంధన ధరల నేపథ్యంలో, వాహన తయారీదారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. స్కొడా ఇండియా కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధమైంది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని స్వీకరించడంపై స్కొడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ‘నెక్స్ట్ లెవల్ స్ట్రాటజీ 2030' గురించి కంపెనీ ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించింది. యూరప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి ఐదు కార్ల తయారీదారులలో స్కొడా ఒకరిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

స్కొడా ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం తమ ఎంట్రీ-లెవల్ పోర్ట్‌ఫోలియోను ఏకీకృతం చేయడానికి కొత్త ప్రణాళికలను రూపొందించింది. కొత్త ఎంట్రీ లెవల్ మోడళ్లపై ప్రణాళికతో పాటు, స్కొడా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ మరియు జీరో-ఎమిషన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టనుంది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

స్కొడా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఎన్యాక్ ఐవి అనే ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తుంది మరియు 2030 నాటికి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి స్కొడా ఎలాంటి సమాచారం వెల్లడించకపోయినప్పటికీ, ఈ బ్రాండ్ ప్రస్తుతం మార్కెట్లో పాపులర్ నేమ్‌ప్లేట్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

ప్రపంచవ్యాప్తంగా స్కొడా ఆక్టేవియా అత్యధికంగా అమ్ముడైన స్కొడా కార్లలో ఒకటిగా ఉంది. కంపెనీ ఇటీవలే ఇందులో నాల్గవ తరం మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆక్టేవియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క స్కేలబుల్ ఎస్ఈబి ఆర్కిటెక్చర్ ఆధారంగా స్కొడా తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. స్కొడా నుండి రాబోయే ఈవీలు ధర మరియు పరిమాణం పరంగా, ఇవి ఎన్యాక్ ఐవి మోడల్‌కి దిగువన ఉంటాయని భావిస్తున్నారు.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

ఐరోపా ఖండంలోని ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో స్కొడా 50 నుండి 70 శాతం వాటాను సాధించాలనే లక్ష్యంతో ఉంది. రెండవ దశలో భాగంగా, 2030 నాటికి భారతదేశం, రష్యా మరియు ఉత్తర ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించాలని స్కొడా యోచిస్తోంది.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

ఇదిలా ఉంటే, కొత్త తరం స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ చెక్ రిపబ్లిక్ బ్రాండ్, ఇప్పుడు తమ సరికొత్త మేడ్ ఇన్ ఇండియా కుషాక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఫోక్స్‌వ్యాగన్-స్కొడా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫాం ఆధారంగా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తయారు చేశారు.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

స్కొడా ఇండియా, భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే అన్ని భవిష్యత్ మోడళ్లను ఎమ్‌క్యూబి-ఏ0-ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ సంస్థ యొక్క గ్లోబల్ ఎమ్‌క్యూఓ ప్లాట్‌ఫామ్ యొక్క భారతీయ వెర్షన్‌గా ఉంటుంది. స్కొడా ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా వస్తున్న మొదటి మోడల్ కుషాక్ ఎస్‌యూవీ కావటం విశేషం.

ఆక్టేవియా ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది; ధృవీకరించిన స్కొడా!

స్కొడా కుషాక్ తయారీలో కంపెనీ 95 శాతం స్థానికికంగా భారతదేశంలో లభించే విడిభాగాలను ఉపయోగిస్తోంది. భారత్‌లో ఇప్పటికే స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మార్కెట్ అంచనా ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto Confirms Octavia Electric Sedan For India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X