కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎవ్వరూ ఊహించని రీతిలో విజృంభిస్తోంది. మొన్నటి వరకూ చాప క్రింద నీరులా ప్రాకిన ఈ వైరస్, ఇప్పుడు ఒక్కసారిగా దేశాన్ని కబళించేస్తోంది. అయితే, ఈ వైరస్‌తో పోరాటాన్ని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా మందుకొస్తున్నాయి.

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి స్కోడా ఆటో మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు 9 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, అటువంటి పరిస్థితిలో, ఉపశమనం మరియు సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

స్కోడా ఆటో మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు ఈ కష్ట కాలంలో భారతదేశంలోని వివిధ నగరాలకు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు మరియు ఇతర ప్రాణాలను రక్షించే పరికరాలను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడానికి కంపెనీ తన లాజిస్టిక్స్ యూనిట్‌ను ఉపయోగిస్తోంది.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలలో పనిచేసే చాలా మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది.

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

ఈ విషయంపై స్కోడా ఆటో సీఈఓ థామస్ షాఫర్ మాట్లాడుతూ, "మేము ప్రతిరోజూ భారతదేశంలోని మా భాగస్వాములతో సంప్రదిస్తున్నాము. ప్రస్తుతానికి చాలా ముఖ్యమైనది ఏమిటో వారికి బాగా తెలుసు." ఆక్సిజన్ ట్యాంకులతో సహా తగిన ఉపశమన పదార్థాలను భద్రపరచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా వాటిని భారతదేశానికి పంపించవచ్చని ఆయన అన్నారు.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

ఈ సమయంలో ఊహించని రీతిలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులతో దేశం అత్యవర పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారతదేశంలో ఆరోగ్య సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, స్కోడా ఆటో ప్రకటించిన ఆర్థిక సాయం, వైద్య ఉత్పత్తులు మరియు ఇతర పరికరాలు బాధితులకు కొంత మేర ఉపశమనాన్ని కలిగించవచ్చని భావిస్తున్నారు.

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి హోండా కార్స్ ఇండియా మరియు మహీంద్రా గ్రూప్‌లు కూడా ముందుకొచ్చాయి. హోండా యొక్క సిఎస్ఆర్ విభాగం, హోండా ఫౌండేషన్ 6.5 కోట్ల రూపాయల సహాయాన్ని విరాళంగా ఇవ్వగా, కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావితమైన నగరాలకు మహీంద్రా ఆక్సిజన్ సిలిండర్లు మరియు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేస్తోంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

జూన్ 2021లో స్కొడా కుషాక్ లాంచ్

స్కొడా బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ "స్కొడా కుషాక్"ను వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల నాటికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే, కంపెనీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది. - ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కోవిడ్‌పై పోరుకు రూ.9 కోట్లు సాయం ప్రకటించిన స్కొడా, ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ బుకింగ్స్ ఓపెన్

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్‌ని చూస్తే, కంపెనీ తమ పాపులర్ టి-రోక్ ఎస్‌యూవీని తిరిగి భారత మార్కెట్లో రీ-లాంచ్ చేయనుంది. ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అతి త్వరలోనే ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రాంభం కానున్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda And Volkswagen Donates INR 9 Crore To Fight COVID-19, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X