కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ 25,000 మాత్రమే

భారత మార్కెట్లో స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీ ఇటీవల కాలంలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన సమయంలోనే కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమయ్యాయి. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కంపెనీ కుషాక్ యొక్క 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్‌ను మాత్రమే డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. అయితే కుషాక్ యొక్క 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ ను ఆగస్టు మొదటి వారంలో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎస్‌యూవీ కొనుగోలు చేడియలనుకునే కస్టమర్లు రూ. 25 వేలు చెల్లించి, డీలర్‌షిప్ లో మాత్రమే కాకుండా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

భారతదేశంలో విడుదలయిన ఈ కుషాక్ ఇప్పటికే చాలామంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఈ కారణంగా ఈ ఎస్‌యూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కుషాక్ ఎస్‌యూవీ విడుదలైన కేవలం 7 రోజుల్లోనే 2 వేల యూనిట్ల బుకింగ్‌లను అందుకుంది.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కుషాక్ ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, దీని టాప్ వేరియంట్‌ ధర రూ. 17.60 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కుషాక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. ఇవి రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడతాయి. అవి 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్జి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంచబడ్డాయి.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది. ఈ కారు తయారీలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను అవలంబించింది, ఇది భవిష్యత్తులో మరింత పెంచాలని యోచిస్తోంది.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉన్న బోనెట్ ఇవ్వబడ్డాయి.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

కారు యొక్క టైల్ భాగం విలోమ L ఆకారంలో ఎల్ఈడీ టైల్ లైట్స్ మరియు పైభాగంలో స్టాప్ లైట్ పొందుతుంది. ఇవి కాకుండా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ మరియు బిగ్ రియర్ బంపర్ ఇవ్వబడ్డాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ వంటివి కూడా స్టాండర్డ్ గా అందించబడ్డాయి.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్‌ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

కుషాక్ డెలివరీలు ప్రారంభించిన స్కోడా; బుకింగ్ ఇప్పుడు 25,000 మాత్రమే

స్కోడా కుషాక్ మొత్తానికి మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఎస్‌యూవీ అద్భుతమైన ఇంటీరియర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటితో పాటు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో విడుదలైన స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, జీప్ కంపాస్, నిస్సాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. స్కోడా కుషాక్ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Skoda Kushaq Delivery Start. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X