స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా భారత మార్కెట్ కోసం 'కుషాక్' అనే సరికొత్త ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, స్కొడా కుషాక్ ఎస్‌యూవీకి సంబంధించిన అఫీషియల్ స్కెచ్‌లను కంపెనీ విడుదల చేసింది. కుషాక్ ఫ్రంట్, రియర్ మరియు ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ వివరాలను ఈ స్కెచ్‌లు వెల్లడి చేస్తాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

స్కొడా ఆటో తమ 'ఇండియా 2.0 ప్రాజెక్ట్'లో భాగంగా కుషాక్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఈ ప్రాజెక్ట్ నుండి భారత్‌లో విడుదల అవుతున్న మొట్టమొదటి స్కొడా మోడల్ కుషాక్ కావటం విశేషం. స్కొడా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'విజన్ ఇన్' అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ కుషాక్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

స్కొడా డిజైన్స్ రిలీజ్ చేసిన కుషాక్ ఇంటీరియర్ స్కెచ్‌ను గమనిస్తే, ఇది టాప్-ఎండ్ వేరియంట్‌ను ప్రతిభింభించేలా ఉంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు దాని క్రింది భాగంలో అమర్చిన సెంటర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, టూ-స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

అలాగే, ఇందులో డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌పై షైనీ ఆరెంజ్ యాక్సెంట్ మరియు ఏసి వెంట్స్, గేర్‌బాక్స్ మరియు స్టీరింగ్ వీల్‌పై క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను కూడా ఆశించవచ్చు. ఈ స్కెచ్‌లో చూసినదాని ప్రకారం, కొత్త స్కొడా కుషాక్ మ్యాన్యువల్ పార్కింగ్ బ్రేక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది మరియు దీని ఇంటీరియర్ క్యాబిన్‌ను మొత్తం డ్యూయెల్ టోన్ లేఅవుట్‌లో తయారు చేసినట్లుగా ఉంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

స్కొడా కుషాక్ పరిమాణం గురించి మాట్లాడుతుంటే, ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ కానుంది. ఈ ఎస్‌యూవీ 4,256 మి.మీ పొడవును, 1,589 మి.మీ ఎత్తును మరియు 2,671 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్కొడా సిగ్నేచర్ గ్రిల్, బంపర్స్ క్రింది భాగంలో స్కఫ్ ప్లేట్స్, కారు బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్, ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కోసం క్రోమ్ గార్నిష్ మరియు డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను ఆశించవచ్చు.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

ఇక దీని సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఇందులో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్, రూఫ్ రైల్స్ మరియు క్రీజ్ లైన్స్ కనిపిస్తాయి. దీని వెనుక భాగంలో ఎల్-ఆకారపు టెయిల్ ల్యాంప్స్, ఫేక్ ఎయిర్ ఇన్‌టేక్స్, పెద్ద సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ మరియు రూఫ్ స్పాయిలర్‌ను ఈ స్కెచ్‌లలో గమనించవచ్చు.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ అండ్ లైట్ సెన్సార్స్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాత కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్కొడా కుషాక్‌ను రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేసే అవకాశం ఉంది. బేస్ మరియు మిడ్ వేరియంట్లలో 1.0-లీటర్ త్రీ సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చు. ఈ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ అఫీషియల్ స్కెచ్ చిత్రాలు వెల్లడి; త్వరలోనే విడుదల

టాప్ రేంజ్ వేరియంట్లలో 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Skoda Kushaq Official Sketch Images Released Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X