భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'కుషాక్' మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. తాజాగా కంపెనీ ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. తమ ప్లాంట్ నుండి స్కొడా కుషాక్ మొదటి బ్యాచ్‌ను బయటకు పంపినట్లు కంపెనీ పేర్కొంది.

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ ప్రారంభం గురించి కంపెనీ ఓ అధికారిక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. కుషాక్ ఎస్‌యూవీ స్కొడా బ్రాండ్‌కి భారతదేశంలో ఓ ప్రముఖమైన మోడల్ కానుంది. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు త్వరలో రానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా ఇండియా తమ కుషాక్ ఎస్‌యూవీ పేరును పరిచయం చేసిన తరువాత, కంపెనీ ఇప్పటివరకు అనేక టీజర్లను కూడా విడుదల చేసింది. ఇటీవల, స్కొడా ఈ ఎస్‌యూవీని తమ వర్క్‌షాప్‌లో పరీక్షిస్తున్న స్పై చిత్రాలు కూడా వెల్లడయ్యాయి. ఆ చిత్రాలలో స్కొడా కుషాక్ పక్కనే ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ను కూడా చూడొచ్చు.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

వాస్తవానికి స్కొడా కుషాక్ ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దీని విడుదల వాయిదా పడింది. అయితే, కొంతకాలం క్రితం, స్కొడా కుషాక్ ఎస్‌యూవీని జూన్ చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్కొడా సీఈఓ జాక్ హోలిస్ తెలిపారు.

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా కుషాక్ భారత మార్కెట్లో విడుదలైన వెంటనే దాని డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ వివరాలను కూడా వెల్లడి చేసే అవకాశం ఉంది. స్కొడా ప్లాంట్‌లో కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం కావటం చూస్తుంటే, త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా ఉన్న స్కొడా డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా వస్తున్న మొట్టమొదటి ఉత్పత్తి ఈ కుషాక్ ఎస్‌యూవీ. కుషాక్ విడుదల తర్వాత కంపెనీ భారత మార్కెట్ కోసం మరిన్ని మోడళ్లను సిద్ధం చేయనుంది. క్రెటా, సెల్టోస్, హారియర్, హెక్టర్ వంటి మోడళ్లతో అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది.

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

భారత మార్కెట్ కోసం స్కొడా తయారు చేయబోయే భవిష్యత్ మోడళ్లన్నింటినీ తమ సరికొత్త ఎమ్‌క్యూబి-ఏ0-ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనుంది. ఈ ప్లాట్‌ఫామ్ సంస్థ యొక్క ప్రపంచ ఎమ్‌క్యూఓ ప్లాట్‌ఫామ్ యొక్క భారతీయ వెర్షన్‌గా ఉంటుంది. స్కొడా కుషాక్ తయారీలో 95 శాతం ఉత్పత్తిని కంపెనీ స్థానికీకరించింది.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా కుషాక్ పరిమాణం గురించి మాట్లాడుకుంటే, దీని వీల్ బేస్ 2,671 మిమీ, పొడవు 4,256 మిమీ మరియు ఎత్తు 1,589 మిమీగా ఉంటుంది. ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం; త్వరలోనే విడుదల

ఇకపోతే రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆప్షన్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Skoda Kushaq SUV Production Begins In India; Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X