స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'కుషాక్'ను వచ్చే నెల భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ కారుకి సంబంధించిన లేటెస్ట్ స్పై చిత్రాలు మరోసారి ఇంటర్నెట్‌లో విడుదల అయ్యాయి.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

భారతదేశంలో ఓ స్కొడా వర్క్‌షాపులో ఆపి ఉంచిన ఈ కొత్త ఎస్‌యూవీ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. కుషాక్ ఎస్‌యూవీని వచ్చే నెలలో దేశీయ విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. స్కొడా కుషాక్ యొక్క పరీక్ష దశ పూర్తయిందని కంపెనీ పోస్ట్ చేసిన చిత్రాలను చూస్తే అర్థమవుతుంది.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

అన్ని భారతీయ వాతావరణ మరియు రహదారి పరిస్థితులకు అనుగుణంగా స్కొడా కుషాక్ ఎస్‌యూవీని వివిధ భూభాగాలపై పరీక్షించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ఎత్తైన పర్వత మార్గాలు, కఠినమైన మరియు బురదతో నిండి మార్గాలు, మృదువైన టార్మాక్ మరియు బంపర్-టు-బంపర్ సిటీ ట్రాఫిక్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

ఈ చిత్రాలు చూస్తే, ఇవి స్కొడా కుషాక్ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్ల మాదిరిగా తెలుస్తున్నాయి. తనిఖీ కోసం హైడ్రాలిక్ రాంప్‌పై ఉంచిన కారుని గమనిస్తే, దానికి వీల్ కవర్లతో స్టీల్ వీల్స్ అమర్చబడి ఉన్నాయి. వీటిని ద్వారా ద్వారా ఇది మిడ్-స్పెక్ ఎస్‌యూవీ మోడల్‌గా తెలుస్తుంది.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

ఈ మిడ్-వేరియంట్లలో షార్క్-ఫిన్ యాంటెన్నా, క్రోమ్-ఫినిష్డ్ ట్రిమ్స్ మరియు ఎల్ఈడి లైటింగ్ వంటి అనేక ఇతర లక్షణాలను కూడా కోల్పోతుందని భావిస్తున్నారు. కుషాక్ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్లలో కోల్పోయే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్స్, పానోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉండొచ్చు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

ఈ వర్క్‌షాప్‌లో స్కోడా కుషాక్ పక్కన నిలిపిన కొన్ని టైగన్ ఎస్‌యూవీలను కూడా ఈ చిత్రాలలో చూడొచ్చు. స్కొడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న విషయం తెలిసినదే. ఇరు కంపెనీలు ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా, భారత మార్కెట్లో విడుదల చేయబోతున్న మొట్టమొదటి మోడళ్లు ఇవి.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లు అనేక విడిభాగాలు, పరికరాలు మరియు ఫీచర్లను పంచుకుంటాయి. దేశంలోని భారతీయ కొనుగోలుదారులకు తగినట్లుగా టైలర్ మేడ్ ఎమ్‌క్యూబి ఎ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని తయారు చేస్తున్నారు. ఇది బ్రాండ్ యొక్క ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే కాస్తంత పొడవుగా ఉంటుంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

వెనుక సీటులో మధ్యలో కూర్చున్న ప్రయాణీకులకు గరిష్ట లెగ్‌రూమ్ అందించడానికి కంపెనీ దీని ట్రాన్స్మిషన్ టన్నెల్ యొక్క ప్రొఫైల్‌ను కూడా తగ్గించింది. మొత్తంమీద, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త ప్లాట్‌ఫామ్ కారణంగా ఇవి రెండూ విశాలమైన క్యాబిన్ స్థలాన్ని కలిగి ఉంటాయి.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

భారతదేశంలోకి రాబోయే ఈ రెండు కొత్త ఎస్‌యూవీలు కొత్త ప్లాట్‌ఫామ్‌తో పాటుగా ఒకేరకమైన పవర్‌ట్రైన్ ఆప్షన్లను కూడా పంచుకుంటాయి. స్కోడా కుషాక్ రెండు ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

స్కొడా కుషాక్ టెస్టింగ్ దశ పూర్తి; వచ్చే నెలలో విడుదల: తాజా చిత్రాలు, వివరాలు

ఇకపోతే రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆప్షన్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Skoda Kushaq Testing Phase Completed, India Launch Next Month: Pics & Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X