ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

బెంగుళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్‌షిప్ ఒక్క రోజులో 100 మాగ్నైట్ కార్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. ఇదివరకు రాజమండ్రిలోని 'కంటిపుడి నిస్సాన్' డీలర్‌షిప్ ఒక్క రోజులో 36 మాగ్నైట్ కార్లను డెలివరీ చేసిన సంగతి తెలిసినదే.

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

నిస్సాన్ ఇండియా ఈ కారును డిసెంబర్ 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆనెలలో సమయాభావం కారణంగా, కంపెనీ అధిక సంఖ్యలో వీటిని కస్టమర్లకు అందించలేకపోయింది. దీంతో ఈ జనవరి 2021 నెలలో కంపెనీ చాలా చోట్ల మాగ్నైట్ మెగా డెలివరీని ప్రారంభించింది.

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం నిస్సాన్, భారత మార్కెట్లో రెండు దేశీయ మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో నిస్సాన్ కిక్స్ మరియు ఇటీవలే విడుదలైన మాగ్నైట్ ఉన్నాయి. మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని గత నెలలో కేవలం రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రారంభ ధరకే విడుదల చేశారు.

MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర కారణంగా మార్కెట్లో ఈ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకూ ఈ మోడల్ కోసం 33,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. దీంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి దీని వెయిటింగ్ పీరియడ్ 6-8 నెలల వరకూ ఉంటోంది.

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్ కోసం వస్తున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. నిస్సాన్ తమ చెన్నై ప్లాంట్‌లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని, మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది.

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

ఇకపోతే, రెండవది 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో లభిస్తోంది. ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి.

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?

నిస్సాన్ ఇటీవలే బేస్ వేరియంట్ నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ ధరను కంపెనీ రూ.50,000 మేర పెంచింది. తాజా ధర పెంపు తర్వాత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఈ ఒక్క వేరియంట్ ధర మినహా మిగిలిన వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Most Read Articles

English summary
Surya Nissan From Bangalore Delivered 100 Magnite Cars In One Day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X