భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా మోటార్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'నెక్సాన్ ఈవీ'ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టి సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కంపెనీ దాదాపు 3,000 యూనిట్లకు పైగా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించింది.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో స్థిరమైన ప్రజాదరణ పొందుతూ, అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 64 శాతం మార్కెట్‌తో భారతదేశపు నెంబర్ వన్ ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాలు పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రతి ఏటా 1,00,000 మొక్కలను నాటడానికి సమానమైన సిఓ2 ఉద్గారాలను తగ్గించే దిశగా ఈ ఎస్‌యూవీ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో, టాటా నెక్సాన్ ఈవీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఓ టెస్టిమోనియల్ వీడియోను కూడా విడుదల చేసింది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

ఈ వీడియోలో కస్టమర్లు తమ నెక్సాన్ ఈవీతో పొందిన అనుభవాన్ని పంచుకుంటారు మరియు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని ఉత్తమ లక్షణాల గురించి కూడా మాట్లాడుతారు. అంతేకాకుండా పూర్తి చార్జ్‌పై వారు సాధించిన గరిష్ట బ్యాటరీ రేంజ్‌ను కూడా ఇందులో వెల్లడించారు. - వీడియో కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఈవి ప్రస్తుతం దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. అంతేకాకుండా, భారతదేశంలోనే ఎక్కువగా ఇష్టపడే మరియు అత్యధికంగా విక్రయించబడే ఎలక్ట్రిక్ కారుగా మారింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ మరియు యాజమాన్యానికి మద్దతుగా కంపెనీ అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

నెక్సాన్ ఈవీ గురించి ప్రజల్లో అవగాన కల్పించడానికి మరియు ఈ ఎస్‌యూవీ అందించే ఫీచర్ల గురించి తెలియజేయటానికి వీలుగా కస్టమర్లు మరియు ఔత్సాహికుల కోసం ఈవీ పర్యటనలు మరియు మైలేజ్ ర్యాలీలను కూడా కంపెనీ నిర్వహిస్తోంది.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

అంతేకాకుండా, దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని, అందుకు తగిన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయటంలో కూడా కంపెనీ కీలకంగా పనిచేస్తోంది. టాటా గ్రూపుకి చెందిన టాటా పవర్‌తో, ప్రతి నెక్సాన్ ఈవీ కస్టమర్ నివాసం వద్ద కంపెనీ హోమ్ ఛార్జర్‌ను ఏర్పాటు చేస్తోంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా పవర్ దేశంలో అతిపెద్ద సిసిఎస్ 2 ఫాస్ట్ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం, దేశంలోని 26 నగరాల్లో 300కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను కంపెనీ ఏర్పాటు చేసింది. అదనంగా, మార్చి 2021 నాటికి చాలా ప్రధాన నగరాలు మరియు రహదారులలో 700 స్టేషన్ల వరకు దీనిని స్కేల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా మోటార్స్ గతేడాది జనవరి(2020)లో తమ నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఇది ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

MOST READ:భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

భారతదేశంలో ఏడాది పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ ఈవీ

నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata Nexon EV Completes 1 Year In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X