నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌లో కంపెనీ సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు రీడిజైన్ చేయబడిన కొత్త రూఫ్ రెయిల్స్‌తో లభ్యం కానుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

గత నెలలో, టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీ యొక్క పాత అల్లాయ్ వీల్ స్థానంలో కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాకుండా, ఈ కారులో ఆఫర్ చేస్తున్న టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది. తాజాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌లో రూఫ్ రెయిల్స్ డిజైన్‌ను మార్చింది.

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

కొత్త టాటా నెక్సాన్‌లోని రూఫ్ రెయిల్స్‌ని నిశితంగా పరిశీలిస్తే, ఇవి కంపెనీ గత 2019 సంవత్సరంలో ప్రవేశపెట్టిన నెక్సాన్‌లో ఆఫర్ చేసిన రూఫ్ రెయిల్స్ మాదిరిగానే అనిపిస్తాయి. మార్చి 2021 అప్‌డేట్ నాటికి కొత్త నెక్సాన్‌లో ఎ-పిల్లర్ పైభాగం వరకు చిన్న రూఫ్ ట్రాక్స్ ఉండగా, కంపెనీ ఇప్పుడు వాటిని పెద్ద రూఫ్ ట్రాక్స్‌తో భర్తీ చేసింది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో.. లేటెస్ట్ ఫీచర్స్ & సూపర్ పర్ఫామెన్స్

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

ఈ చిన్న మార్పు మినహా, కొత్త టాటా నెక్సాన్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. యాంత్రికంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇక టాటా నెక్సాన్‌లో చేసిన అల్లాయ్ వీల్స్ మార్పు విషయానికి వస్తే, నిజానికి టాటా నెక్సాన్ యొక్క పాత అల్లాయ్ వీల్స్ డిజైన్ ఖచ్చితంగా ప్రత్యేకమైనది మరియు చాలా ఆకర్షణీయమైనదిగా ఉంటుంది.

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

కాకపోతే, ఇందులో కొత్తగా జోడించిన 16 ఇంచ్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంటాయి. టాటా మోటార్స్ తమ పాపులర్ టాటా నెక్సాన్‌తో సహా ఇతర మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను గత ఏడాది మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇందులో ఫేస్‌లిఫ్ట్ వచ్చినప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

టాటా మోటార్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గడచిన మే 2021 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ప్యాసింజర్ వాహనాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత నెలలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 6,439 యూనిట్లుగా ఉంటే, మే 2020లో ఇవి 623 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

టాటా మోటార్స్ ఇటీవలే నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను కూడా పెంచింది. ధరల పెరుగుదల తరువాత, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పుడు రూ.7.19 లక్షల (బేస్ వేరియంట్) నుంచి రూ.12.95 లక్షల (టాప్-స్పెక్ డీజిల్ ఎక్స్‌జెడ్ఏ + డిటి (ఓ) వేరియంట్) మధ్యలో అమ్ముడవుతోంది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులోని 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

నెక్సాన్ ఎస్‌యూవీలో సైలెంట్‌గా డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా మోటార్స్!

టాటా నెక్సాన్‌లో చేసిన ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన భౌతిక బటన్లు కూడా కొత్త వెర్షన్‌లో తొలగించారు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని వాల్యూమ్ ఆపరేషన్, ట్రాక్‌లను మార్చడం, ఫోన్‌బుక్‌ను యాక్సెస్ చేయడం వంటి మరెన్నో ఫీచర్లను యాక్సెస్ చేయడానికి ఈ భౌతిక బటన్లు ఉపయోగపడేవి. కాగా, ఇప్పుడు ఈ బటన్లు ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్ లోపల డిజిటల్‌గా విలీనం చేయబడ్డాయి.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

Source: Team BHP

Most Read Articles

English summary
Tata Nexon SUV Spotted With New Design Roof Rails, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X